NTV Telugu Site icon

CM Revanth: మాగనూర్​ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పుడ్ పాయిజన్.. సీఎం సీరియస్

Cm Revanth Reddy

Cm Revanth Reddy

నారాయణపేట జిల్లాలోని మాగనూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులెవరైనా సరే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలితే సంబంధిత అధికారులను సస్పెండ్ చేయాలని కలెక్టర్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సంఘటనలో అస్వస్థతకు గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని సీఎం రేవంత్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. బాధిత విద్యార్థులకు వెంటనే మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సంఘటనకు దారి తీసిన కారణాలపై వెంటనే విచారణ జరిపి, తనకు నివేదికను అందజేయాలని సీఎంవో అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకూడదని ముఖ్యమంత్రి హెచ్చరించారు. వెంటనే అన్ని జిల్లాల కలెక్టర్లను అప్రమత్తం చేశారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించే విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడైనా ఇలాంటి ఘటనలు జరిగితే బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

Read Also: Hyderabad: రేపు తెలంగాణ ఒలింపిక్ అసోసియేష‌న్ ఎన్నిక‌లు..

బుధవారం స్థానిక మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో మధ్యాహ్నం సాంబార్ గుడ్లతో కూడిన భోజనం చేసిన విద్యార్థులకు కొద్ది నిమిషాల వ్యవధిలోనే అస్వస్థతకు గురయ్యారు. ఒక్కొక్క విద్యార్థి అపారమైన స్థితిలోకి వెళ్లడం..వాంతులు, విరోచనాలు, కడుపునొప్పి తో బాధపడ్డారు. ఉపాధ్యాయులకు విషయం తెలపడంతో ప్రభుత్వ ఆసుపత్రికి విద్యార్థులను తరలించారు.

Read Also: Assembly Polls: మహారాష్ట్ర, జార్ఖండ్‌లో పోటెత్తిన ఓటర్లు.. పోలింగ్ శాతం ఎంతంటే..!

Show comments