Site icon NTV Telugu

Schocking : టీవీ సీరియల్ గొడవ.. మహబూబాబాద్‌లో భార్య బిడ్డతో ఆత్మహత్యాయత్నం

Couple

Couple

Schocking : మహబూబాబాద్ జిల్లాలో కుటుంబ కలహం దారుణానికి దారితీసిన ఘటన చోటుచేసుకుంది. భర్త ఆకలికన్నా టీవీ సీరియల్‌ ముఖ్యమా అని మందలించడంతో, భార్య మనస్థాపానికి గురై కుమారుడితో కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన విషాదకర సంఘటన వెలుగుచూసింది. వివరాల్లోకి వెళ్తే, బయ్యారం మండలంలోని కోడిపుంజులతండాకు చెందిన దారావత్‌ రాజు, కవిత దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కూతురు ఉన్నారు. సాధారణంగా సుఖశాంతులతో జీవనం సాగిస్తున్న ఈ కుటుంబంలో ఇటీవల విరసత చోటుచేసుకుంది.

Jagdeep Dhankhar: మాజీ ఉపరాష్ట్రపతి ఎక్కడ ఉన్నారు.. క్షేమంగానే ఉన్నారా?

భర్త రాజు పొలం పనులు ముగించుకొని ఇంటికి చేరి అన్నం పెట్టమని భార్యను అడగగా, అప్పటికే టీవీ సీరియల్‌లో మునిగిపోయిన కవిత “అడ్వర్టైజ్‌మెంట్ వచ్చినప్పుడు పెడతాను” అని చెప్పింది. దీంతో భర్తకు ఆగ్రహం వచ్చి “నా ఆకలికన్నా నీకు సీరియల్ ముఖ్యమా?” అంటూ కోపంగా బయటకు వెళ్లిపోయాడు. భర్త మాటలకు మనస్తాపానికి గురైన కవిత తీవ్ర నిర్ణయం తీసుకుంది. తన కుమారుడికి పురుగుల మందు తాగించి, తాను కూడా అదే మందు తాగింది. కూతురికీ తాగించే ప్రయత్నం చేస్తున్న సమయంలో, ఇంటికి తిరిగి వచ్చిన రాజు గమనించి అడ్డుకున్నాడు. వెంటనే తల్లి–కుమారుడిని స్థానికుల సహాయంతో జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు కుమారుడి పరిస్థితి విషమంగా ఉందని చెబడంతో, మెరుగైన చికిత్స కోసం వరంగల్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Chiranjeevi – Pawan Kalyan : అప్పుడు పవన్ కల్యాణ్‌.. ఇప్పుడు చిరంజీవి.. అదే సీన్ రిపీట్..

Exit mobile version