అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాలిఫోర్నియాలో జరిగిన కారు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు రూమ్మేట్స్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.
కడియాల భావన(24), పి.మేఘనా (24)లు తెలంగాణలోని మహబూబాబాద్ వాసులు. ఉన్నత చదువుల కోసం రెండేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. ఒహియోలోని డేటన్లో ఇద్దరూ కలిసి నివసిస్తున్నారు. ఇటీవలే ఇద్దరి కోర్సులు పూర్తయ్యాయి. ఉద్యోగాల కోసం ప్రస్తుతం అక్కడే నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో క్రిస్మస్ ట్రిప్ కోసం కాలిఫోర్నియా వెళ్లి ప్రాణాలు పోగొట్గుకున్నారు. ఆదివారం సాయంత్రం కాలిఫోర్నియాలోని అలబామా హిల్స్ సమీపంలో కారు లోతైన లోయలో పడటంతో ఇద్దరూ మృతిచెందారు. ప్రమాదంలో అక్కడికక్కడే మరణించారని మీడియా నివేదికలు తెలిపాయి.
భావన, మేఘన మరణవార్త సోమవారం మధ్యాహ్నం తెలిసిందని భావన బంధువు సాగర్ బాబు తెలిపారు. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఫోన్ కాల్ వచ్చిందని.. అక్కడ స్థానిక అధికారులు సమాచారం అందించినట్లు వెల్లడించారు.
‘‘భావన తండ్రి కె. కోటేశ్వరరావు ఇటీవల స్థానిక సంస్థల ఎన్నికల్లో డిప్యూటీ సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. డిసెంబర్ 22న ప్రమాణ స్వీకారం చేశారు. భావన మరణవార్తతో కుటుంబం మొత్తం ఛిన్నాభిన్నమైంది. ఆమె తల్లి ఈ వార్తను జీర్ణించుకోలేకపోతోంది.’’ అని సాగర్ బాబు అన్నారు. భావన, మేఘన ఇద్దరూ కూడా సన్నిహితంగా ఉన్నారని తెలిపాడు. చాలా ఉల్లాసంగా.. సంతోషంగా ఉంటారని పేర్కొన్నాడు. చాలా పెద్ద కలలు కన్నారని.. అమెరికాలోనే తమ భవిష్యత్‌ను స్థిరపరుచుకోవాలని డిసైడ్ అయ్యారని పేర్కొన్నాడు.
ఇది కూడా చదవండి: Priyanka Gandhi Son: ప్రియురాలితో ప్రియాంకాగాంధీ కుమారుడు నిశ్చితార్థం! కోడలు ఎవరంటే..!
భావనాది ముల్కనూర్ గ్రామం కాగా.. మేఘనాది రాణి గార్ల గ్రామం. ఈ రెండు గ్రామాలు కూడా తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ఉన్నాయి. ఇక మేఘనా తండ్రి పుల్లఖండం నాగేశ్వరరావు గార్ల గ్రామంలో మీ సేవా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. అంత్యక్రియలు నిర్వహించడానికి కుటుంబాలు సహాయం కోరుతున్నాయి. మృతదేహాలను భారతదేశానికి తిరిగి తీసుకురావడంలో ప్రభుత్వాలను సాయం కోరారు.
ఇది కూడా చదవండి: Putin AI Video: మోడీ, జెలెన్స్కీకి పుతిన్ క్రిస్మస్ గిఫ్ట్‌లు.. ఏఐ వీడియో వైరల్