Boyfriend Harassment:అతనికి భార్య ఉంది.. అయినా కూడా వేరే యువతితో ప్రేమాయణం నడిపాడు. నీకు భార్య ఉంది అయినా నాతో ప్రేమించడం ఏంటని ప్రశ్నించినా… నాకు నువ్వే కావాలని మాయమాటలతో నమ్మించాడు. నిన్నే పెళ్లాడుతా అంటూ నమ్మించి ఆ యువతిని అనుభవించాడు. ఆ యువతితో ప్రేమాయణం నడిపాడు. నిజమే అని నమ్మిన ఆ యువతి సర్వం సర్పించింది. తన భార్యకు మోసం చేసే అతడు తనని మోసం చేయడని గుడ్డిగా నమ్మింది. ఆ వయస్సులో అతను చెప్పేదంతా నిజమే అని నమ్మి అతనితో ప్రేమలో పడింది. ఇద్దరు దగ్గరయ్యారు ఇంతలోనే సీన్ రివర్స్ అయ్యింది. చివరకు మోసపోయానని గ్రహించిన ఆయువతి ఆత్మహత్యకు పాల్పడింది. తన చావుకు ప్రియుడే కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆగ్రహించిన యువతి కుటుంబ సభ్యులు ప్రియుడు ఇంటిముందు ధర్నాకి దిగారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.
Read also: VI Recharge : నేటి నుంచే ‘విఐ’ పెంచిన కొత్త ధరలు అమల్లోకి..
మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం తానంచర్ల శివారు జెండాల తండాలో ఆత్మహత్య చేసుకున్న అనూష కుటుంబ సభ్యులు నివాసం ఉంటున్నారు. అక్కడే ఉంటున్నా భుక్య సురేష్ కుటుంబం కూడా ఉంటుంది. తన తండ్రి చందు. భుక్య సురేష్ కు ఇంతకు ముందే పెళ్లైంది. అయితే భార్య భర్తల మధ్య ఏమైందో తెలియదు కానీ భుక్య సురేష్ కు అనుషతో పరిచయం ఏర్పడింది. వీరద్దరూ కొద్ది రోజులుగా దగ్గరయ్యారు. భుక్య సరేష్ ను పెళ్లైందని మరి తనతో ప్రేమలో ఉన్నావని తన పరిస్థితి ఏంటని అనూష ప్రశ్నించింది. వీరిద్దరు పెళ్లిపై వ్యవహారం చర్చించి నట్లు తెలుస్తుంది. అయితే ఇంటికి వచ్చిన అనూష ఎవరూ లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుసుంది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు తలుపు తెరిచి చూడా అనూష విగత జీవిగా పడిఉండటాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. పక్కనే సూసైడ్ నోట్ రాసి ఉండటం చూసి ఆగ్రహంతో భుక్య సురేస్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. తన కూతురు భుక్య సురేష్ వల్లే ఆత్మహత్య చేసుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు భుక్య సురేష్ ఇంటి వద్దకు చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఎటువంటి అవాంఛిత ఘటనలు జరగకుండా భారీగా మోహరించారు. అనూష కుటుంబానికి సముదాయించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Kalki 2898 AD: ‘కల్కి 2898 ఏడీ’లో అమితాబ్ బచ్చనే మొదటి హీరో: అశ్వినీ దత్