Site icon NTV Telugu

తెలంగాణలో రజాకార్ల పాలన నడుస్తుంది: మధుయాష్కీ

తెలంగాణలో రజాకార్ల పాలన నడుస్తోందని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మధుయాష్కీ గౌడ్‌ అన్నారు. ఈ సందర్భంగ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ ప్రభుత్వాన్ని విమర్శించారు. తెలంగాణ రాష్ర్టంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు కొడుకు రాఘవ ఒక వ్యాపారి కుటుంబం చావుకు కారణం అయ్యాడన్నారు. సీఎంకు మానవత్వం ఉంటే వెంటనే వనమా రాఘవను అరెస్టు చేయాలన్నారు. లేదంటే ఈ విషయాన్ని కాంగ్రెస్‌ పార్టీ మహిళా కమిషన్‌ దృష్టికి తీసుకెళ్తుందన్నారు. రాఘవను ముందే అరెస్టు చేసి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఉండేది కాదని ఆయన ఫైర్‌ అయ్యారు. నేరస్తులను రక్షించాడానికి నిన్ను ముఖ్యమంత్రిని చేయలేదని ఆయన మండిపడ్డారు.

Read Also: ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు బహిరంగ లేఖ

24గంటల్లో రాఘవను అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. కేసీఆర్‌ నయా రజాకార్‌గా మారిపోయాడన్నారు. పాల్వంచలో ఘోరంగా హత్యకు కారణం అయిన వారిని అధికార పార్టీ ఎందుకు రక్షిస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాఘవ ప్రగతి భవన్‌లో ఉన్నాడా..? పువ్వాడ ఇంట్లో ఉన్నాడా..? కేటీఆర్‌ దగ్గర ఉన్నాడా వెంటనే పోలీసులు తేల్చాలన్నారు. బీజేపీ మంత్రులు ఓ వైపు రైతులను తొక్కి చంపేస్తుంటే, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ప్రజలను బతకనీయడం లేదంటూ మధుయాష్కీ ఫైర్‌ అయ్యారు.

Exit mobile version