NTV Telugu Site icon

Madhu Yaskhi Goud: బీజేపీ, బీఆర్ఎస్‌లకు ఆ నిధులు ఎక్కడివి? ప్రశ్నిస్తే కేసులు పెడతారా?

Madhu Yaskhi Goud

Madhu Yaskhi Goud

Madhu Yaskhi Goud Questions BJP BRS Parties Over Huge Funds: దేశంలో ప్రతి వ్యక్తికి స్వేచ్ఛ, సమానత్వాలు కలిగించింది కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ పేర్కొన్నారు. ఒకే నేరంపై వివిధ రాష్ట్రాల్లో కేసులు వేయడం, కోర్టు దాన్ని సమర్థించడం చాలా బాధగా ఉందన్నారు. సూరత్ కోర్ట్ జడ్జిమెంట్ తరువాత తాము హైకోర్టుకు వెళ్లామని, విచారణని కోర్టు 66 రోజులు పెండింగ్‌లో పెట్టిందని పేర్కొన్నారు. కోర్టులపైన కాంగ్రెస్ పార్టీకి నమ్మకం ఉందన్నారు. ఉపా కేసులు పెట్టి, వరవరరావు లాంటి వారిని బీజేపీ జైల్లో పెట్టిందని మండిపడ్డారు. తెలంగాణలో కూడా అనేక మందిపై అర్బన్ నక్సల్ పేరుతో కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

Rahul Gandhi: ప్రధాని అవ్వకుండా రాహుల్‌పై బీజేపీ కుట్ర.. కాంగ్రెస్ నేతలు ఫైర్

10,130 కోట్లు బీజేపికి ఎలక్ట్రోల్ బాండ్ల పేరు మీద నిధులు వచ్చాయని.. అలాగే 350 కోట్లు ఎలక్ట్రోల్ బాండ్‌ల పేరుతో బీఆర్ఎస్ పార్టీకీ నిధులొచ్చాయని మధుయాష్కీ కుండబద్దలు కొట్టారు. ఇంత మొత్తంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. ఇవన్నీ ప్రశ్నిస్తే తమపై కేసులు పెడతారా? అని నిలదీశారు. బీజేపీ, బీఅర్ఎస్ పార్టీల నియంత, అవినీతి పాలనపై కాంగ్రెస్ నిరంతరం పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. తాము చేస్తున్న మౌన దీక్ష కేవలం రాహుల్ గాంధీ కోసమే కాదని.. దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి స్వేచ్ఛ కోసమని వివరణ ఇచ్చారు. గాంధీ భవన్‌లో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన మౌన దీక్షలో భాగంగా.. మధుయాష్కీ ఈ వ్యాఖ్యలు చేశారు.

Kavya Kalyanram: బాడీ షేమింగ్ రూమర్స్ .. ‘బలగం’ బ్యూటీ క్లారిటీ

అంతకుముందు కూడా.. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే బీసీలు పార్టీ దగ్గరవ్వాలని మధుయాష్కీ గౌడ్ పిలుపునిచ్చారు. పార్టీకి దూరమైన వర్గాల్ని తిరిగి పార్టీకి దగ్గర చేయాలని రాహుల్ గాంధీ, ఖర్గే ఆదేశించారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సామాజిక న్యాయం జరగలేదని, బీసీలను బీఆరర్ఎస్ అణిచివేస్తోందని ఆరోపణలు చేశారు. ఒక కులం మాత్రమే ముందుపడితే.. ఏ పార్టీ అధికారంలోకి రాదని, కాంగ్రెస్ పార్టీలో బీసీలకే సీఎం పదవులు వస్తున్నాయని చెప్పుకొచ్చారు.