భారత రాజ్యాంగకర్త డా. బీఆర్ అంబేద్కర్ 131 జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో కాంగ్రెస్ నేతలు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. బండి సంజయ్.. దేని కోసం యాత్ర చేస్తున్నారు.. పెట్రో.. డీజిల్ ధరలు పెంచినందుకా.. సంగ్రామ యాత్ర అంటూ విమర్శించారు. పేదల ఆదాయం తగ్గింది.. మోడీ ప్రభుత్వ ఆదాయం పెరిగిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో పైశాచిక ఆనందం పొందే వ్యక్తి అధికారంలో ఉన్నారని, కేసీఆర్ యాసంగిలో వరి వేయద్దన్నారు.. ఇప్పుడు కోంటా అన్నాడు.. వడ్లు కొనేది ఉంటే..రెండేళ్లు డ్రామాలు ఆడి రైతులను మోసం చేశారన్నారు. ఈడీ, సీబీఐ దాడుల నుండి బయట పడేందుకు బీజేపీ మీద కొట్లాడినట్టు డ్రామాలు వేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. బీజేపీ..టీఆర్ఎస్ రాజకీయ డ్రామాలు ప్రజలు గమనించాలని, సామాజిక న్యాయం ఏర్పడితేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాంగము మార్చే అంతా సత్తా కేసీఆర్‌కు లేదని, కుట్ర పూరిత ప్రకటన అని ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. సమస్య సృష్టించి… పరిష్కారం చేసినట్టు కేసీఆర్ నాటకం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Madhu Yaskhi Goud : పేదల ఆదాయం తగ్గింది.. మోడీ ప్రభుత్వ ఆదాయం పెరిగింది

Madhu Yaskhi