Site icon NTV Telugu

Madhu Yashki : హైదరాబాద్‌ని విష నగరం చేశారు

Congress Leader Madhu Yashki Goud Fired on Minister KTR.

కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ నేతలు నువ్వానేనా.. అనే విధంగా విమర్శలు గుప్పించుకుంటున్నారు. తాజాగా తెలంగాణ కాంగ్రెస్‌ ప్రచార కమిటీ చైర్మన్‌ మధు యాష్కీ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ కి అడ్డాగా మారిందని, ఏడేళ్ల టీఆర్‌ఎస్‌ పాలనలో విశ్వనగరం.. విష నగరంగా మారిందన్నారు. తమ్మీ తారక రామారావు… 50 యెండ్లలో ఏం చేసింది కాంగ్రెస్ అంటున్నావు.. కాంగ్రెస్ ఐటీకి హైదరాబాద్ నీ హబ్ గా చేసింది అని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుండా నీ హయంలో డ్రగ్స్ కి క్యాపిటల్ సిటీగా మారిందని, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అని, తల్లిగా తెలంగాణ ఇచ్చింది సోనియా అని వెల్లడించారు.

ఏడేళ్లలో విద్యార్థులను మత్తుకు బానిసగా మార్చేశారని, హైదరాబాద్‌ని విష నగరం చేశారని ఆయన ఆరోపించారు. విద్యుత్ ఛార్జీలు పెరిగాయి. ఆర్టీసి ఛార్జీలు పెంచారు. ఆసుపత్రుల్లో రోగులను ఎలుకలు కొరుకుతుంటే… సిగ్గు అనిపించడం లేదా అని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌కి పంటి నొప్పి వస్తే… ఢిల్లీ పోతారు, టెస్టుల కోసం యశోద ఆసుపత్రికి పోతారని, ప్రత్యేక విమానం కి పెట్టిన ఖర్చు ఐసీయూ బాగు చేయొచ్చని ఆయన అన్నారు. ప్రతీ గింజా కోంటా అని చెప్పిన కేసీఆర్‌.. కల్లబొల్లి మాటలు అపి కల్లాల్ల్లో ఉన్న ధాన్యం కొను.. రైతులను నట్టేట ముంచి… రైస్ మిల్లర్ల తో కుమ్మక్కు అయ్యారని ఆయన మండిపడ్డారు.

Exit mobile version