కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితి లో ఉంది. ఎవరు బహిరంగంగా మాట్లాడొద్దు అని ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కీ అన్నారు. అందరికీ సమస్యలు ఉన్నాయి… కానీ పార్టీ వేదిక మీద మాట్లాడుకోవాలి. కోమటిరెడ్డి నేరుగా సోనియా గాంధీ తో మాట్లాడే వెసులు బాటు ఉంది. Vh మాట్లాడుతున్నారు కోమటిరెడ్డితో అని చెప్పారు. నేను కూడా ఇంకొంత మంది నాయకులతో మాట్లాడతా… కలిసి పని చేయాల్సిన సమయం ఇది. హుజూరాబాద్ ఎన్నికల్లో మూడు వేల ఓట్లు రావడం ఇబ్బందే. గతంలో ఎప్పుడూ ఇంత తక్కువ ఓట్లు రాలేదు. కాంగ్రెస్ సభలకు జనం తరలించే పరిస్థితి నుండి తరలి వచ్చే పరిస్థితి రావాలి. అందుకే ప్రజా చైతన్య యాత్రలకు శ్రీకారం చుడుతున్నాము. వరి ధాన్యం కొనుగోలుపై పూటకో మాట మాట్లాడటం ఆపాలి సీఎం అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ క్లిష్ట పరిస్థితి లో ఉంది… ఎవరు మాట్లాడొద్దు : మధు యాష్కీ
