హైదరాబాద్ లో కలుషిత నీరు కలకలం రేపుతోంది. గుట్టల బేగంపేటలో జలమండలి సరఫరా చేసే తాగునీరు కలుషితమై (water contamination) ఓ వ్యక్తి మృతి చెందగా.. 200 మందికి పైగా అస్వస్థతకు గురవడం ఆందోళన కలిగిస్తోంది. మరికొందరి పరిస్థితి విషమంగా వుంది. కొద్ది రోజులుగా తాగునీరు దుర్వాసన వస్తోందని వాటర్ వర్క్స్ సిబ్బందికి చెప్పినా పట్టించుకోలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. మాదాపూర్ గుట్టలబేగంపేటలోని వడ్డెర బస్తీలో కలుషిత నీరు తాగి భీమయ్య (27) మృతిచెందగా.. రెండేళ్ల అతని కుమారుడు…
తెలంగాణలో వ్యాక్సిన్ ల చోరీ కలకలం రేపుతోంది. కొండాపూర్ ఏరియా ఆసుపత్రిలో 500 కోవిషిల్డ్ డోసులు మాయం అయ్యాయి. ఈ ఘటనలో ఒకరి పై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు ఆసుపత్రి సిబ్బంది, అధికారులు. అయితే ఈ కోవిషిల్డ్ డోసులు మాయమైన రోజు నుంచి ఓ కాంట్రాక్ట్ ఉద్యోగి కూడా కనిపించడం లేదు. దాంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు ఆసుపత్రి సూపరిండెంట్. అనంతరం ఆసుపత్రికి చేరుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే తెలంగాణలో…