NTV Telugu Site icon

ఎంపీ అర్వింద్‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ ఫోన్‌.. వెంట‌నే ఢిల్లీకి రండి..

బీజేపీ ఎంపీ ధ‌ర్మ‌పురి అర్వింద్.. నిజామాబాద్‌ జిల్లా ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం ప‌ర్య‌ట‌న పెద్ద ర‌చ్చ‌గా మారింది.. అర్వింద్‌ను టీఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకుని, దాడికి తెగ‌బ‌డ్డాయి.. బీజేపీ నేతలు, కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో అర్వింద్‌ కారుతోపాటు ఐదు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు బీజేపీ నేతలు, కార్య కర్తలకు తీవ్రగాయాలయ్యాయి. అయితే, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు లోక్‌స‌భ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా ఫోన్ చేసి ఆరా తీశారు.. ఆర్మూర్‌లో టీఆర్ఎస్ కార్యకర్తల దాడి వివరాలను అడిగి తెలుసుకున్న స్పీకర్… దాడి ఎలా జరిగింది అని ఆరా తీశారు.. ఇక‌, పోలీసులు వ్యవహరించిన తీరును స్పీకర్ కు వివరించిన ధర్మపురి… రాష్ట్ర ప్రభుత్వం తనపై పోలీసుల సహకారంతో హ‌త్యాయ‌త్నం చేసిందని స్పీకర్ కు దృష్టికి తీసుకెళ్లారు.. అయితే, వెంటనే ఢీల్లికి రావాలని ఎంపీ అర్వింద్‌కు చెప్పారు స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లా.. కాగా, మరో రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి పార్లమెంట్ స్పీకర్‌కు దాడి వ్య‌వ‌హారంపై ఫిర్యాదు చేసేందుకు ఎంపీ ధర్మపురి అర్వింద్ సిద్ధం అవుతున్న‌ట్టుగా తెలుస్తోంది.

Read Also: ప్ర‌ధానికి సీఎం జ‌గ‌న్ లేఖ‌.. ఐఏఎస్‌లను అలా పంపితే మా పరిస్ధితేంటీ..?