NTV Telugu Site icon

Attack: చెరువు కబ్జా..! బీజేపీ నేతలపై గోపన్‌పల్లి వాసుల దాడి

Attack

Attack

హైదరాబాద్‌ లోని శేరిలింగంపల్లిలో భారతీయ జనతా పార్టీ నేతలపై దాడి జరిగింది. గోపన్‌పల్లి ప్రాంతంలో ఓ చెరువు స్థలాన్ని కబ్జా వ్యవహారంలో ఈ ఘర్షణ జరిగినట్టుగా తెలుస్తోంది.. శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన నేతలు గజ్జల యోగానంద్‌, మువ్వా సత్యనారాయణలు తమ అనుచరులతో కలిసి గోపన్‌పల్లి వెళ్లగా.. స్థానికులు వారిపై దాడి చేశారు. బీజేపీ నేతలు చెరువును ఫొటోలు తీస్తుండగా.. స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు.. కబ్జాకు గురైన చెరువు అది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో స్థానికులు.. యోగానంద్‌, సత్యనారయణలపై పిడిగుద్దులతో విరుచుకుపడినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత చందానగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఇరు వర్గాలు ఫిర్యాదులు చేసుకున్నాయి.