Loan App Harassment: లోన్ యాప్ వేధింపులకు మరొకరు బలి.. కానిస్టేబుల్ ఆత్మహత్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
లోన్ ఆప్స్ నిర్వాకుల ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నాయి. అందరికీ ధైర్యం చెప్పాల్సిన పోలీస్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాదులో కలకలం సృష్టిస్తుంది. ఫైర్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సుధాకర్ ని లోన్ నిర్వాహకులు విపరీతంగా వేధించారు. సకాలంలో డబ్బులు చెల్లించకపోవడంతో భార్య ఫోటోలని మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోలు గా తయారుచేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామంటూ కానిస్టేబుల్ కి లో నిర్వాహకులు బెదిరింపులకు పాల్పడ్డారు. లోన్ నిర్వాహకులు చేసిన బెదిరింపులతో భయపడుతున్న కానిస్టేబుల్ ఏకంగా సూసైడ్ పాల్పడ్డాడు. రైల్ పట్టాల మీద తలపెట్టి కానిస్టేబుల్ సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడు. లోన్ నిర్వాహకుల వేధింపుల వల్లే సుధాకర్ ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. ఒక లోన్ అప్ నుంచి సుధాకర్ కొంత రుణం తీసుకున్నాడు. తీసుకున్న రుణాన్ని మొత్తంగా కూడా సుధాకర్ చెల్లించాడు. అదే సమయంలో మరికొంత రుణాన్ని కూడా తీసుకోవడం జరిగింది. ఈ రుణానికి సంబంధించి అధిక మొత్తంలో ఇప్పటివరకు లోన్ యాప్ నిర్వాహకులు చెల్లించుకున్నారు. అయితే మరికొంత డబ్బులు ఇవ్వాలని సుధాకర్ ను లోన్ అప్ వాళ్ళు నిత్యం వేధించారు. ఇప్పటికే అన్ని డబ్బులు చెల్లించాలని ఇక ఇవ్వాల్సిన అవసరం లేదని సుధాకర్ చెప్పాడు. లోన్ నిర్వాహకులు మాత్రం వేధింపులను ఆపలేదు. డబ్బులు చెల్లించకపోతే నీ భార్య ఫోటోలను న్యూడ్ వీడియోలుగా తయారు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో పాటుగా మీ కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించారు.
రోజు రోజుకు లోన్‌యాప్స్ నిర్వాకుల ఆగడాలు పెరిగిపోతున్నాయి. అప్ ద్వారా డబ్బులు అప్పు గా ఇచ్చి ప్రాణాల బలిగొంటున్నారు. అవసరం కోసం ఆన్‌లైన్ లోన్ యాప్‌లో చేసిన ఆరు వేలు అప్పు ఫైర్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సుధాకర్ తీసుకున్నాడు. రూ.6000 అప్పు సుధాకర్ పాలిట శాపమైది. సొమ్ము సకాలంలో చెల్లించలేదనే నెపంతో నిర్వాహకులు ఫోన్లో వెంచడం మొదలుపెట్టారు. నీ భార్య ఫోన్ నెంబర్ అశ్లీల వెబ్‌సైట్‌లో పెడితే రోజుకు వెయ్యి రూపాయల వస్తాయంటూ అసభ్యకరంగా మాట్లాడారు. దీనికి తోడుగా నీ భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ ఫోటో వీడియోలను సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరించారు. అంతేకాకుండా మీ భార్య ఫోటోలు వీడియోలని నీ స్నేహితులు బంధుమిత్రులకు పంపిస్తామంటూ హెచ్చరించారు. ఆ యాప్‌కు చెందిన వ్యక్తులు చేసిన వేధింపులు అతన్ని ఆత్మహత్యకు పురిగొల్పాయి. అవమానం భారంతో రైలు కింద పడి ప్రాణం తీసుకునేలా చేసింది.
Also Read

జల్‌పల్లి-శాస్త్రిపురం మార్గంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జల్‌పల్లికి చెందిన యంజాల సుధాకర్ చందులాల్ బారదరి ఫైర్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు.ఆయనకు భార్య మాధవితోపాటు 18 నెలల వయస్సున్న కూతురు ఉన్నారు. అయితే, గోల్డెన్ రూపీ అనే లోన్ యాప్ నుంచి తీసుకున్న ఆరు వేలు రుణాన్ని సుధాకర్ సకాలంలో చెల్లించలేకపోయారు. దీంతో ఆ యాప్ ఏజెంట్ల నుంచి వేధింపులకు ఎక్కువైనాయి. ఎన్నిసార్లు బాకీ సొమ్ము చెల్లించినా ఇంకా బకాయి ఉన్నావంటూ ఫోన్ చేసి చిత్ర హింసలకు గురి చేశారు. అసభ్య పదజాలంతో ఫోన్‌కు మెసేజ్‌లు పెట్టి మానసికంగా హింసించేవారు. నీ భార్య నంబర్ అశ్లీల వెబ్‌సైట్‌లో పెడితే ఒక్కో కస్టమర్ నుంచి వెయ్యి రూపాయల వస్తాయని మెసేజ్లను పెట్టేవారు. దీనికి తోడుగా మీ భార్య ఫోటోలను మార్ఫింగ్ చేసి న్యూడ్ వీడియోలు తయారుచేసి సోషల్ మీడియాతో పాటుగా బంధుమిత్రులు కు పంపిస్తామంటూ హెచ్చరించారు. అంతేకాక, సుధాకర్ ఓ మోసగాడు అని కాంటాక్ట్ లిస్టులో ఉన్న పలువురికి మెసేజ్‌లు పెట్టారు. సుధాకర్ ఫోటో మీద చీటర్ అనే ముద్ర వేసి ఫోటోలని సోషల్ మీడియాతో పాటు మిత్రులకు పంపించారు. వీటన్నింటినీ మనస్తాపం చెంది సుధాకర్ ఇటీవల సన్నిహితుల వద్ద చెప్పుకున్నారు. మంగళవారం ఉదయం 6 గంటలకు ఇంటి నుంచి బయటకెళ్లిన సుధాకర్ 6:12 నిమిషాలకు అన్న కుమార్‌కు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుగా నిర్ణయం చెప్పారు. శివరాంపల్లి – శాస్త్రీపురం మార్గంలో ఉన్న రైల్వే ట్రాక్‌పై రైలు కింద తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సుధాకర్ దగ్గర దొరికిన ఫోటో ఐడెంటికాలను గుర్తించి రైల్వే పోలీసులు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. ఈ మెరకు కుటుంబ సభ్యులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు పై గోల్డ్ రుపీ లోన్ యాప్ పై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. లోన్ అప్ నిర్వాకులు పెట్టే వేధింపులకు ఎవరు ఆందోళన చెందవద్దని, అలాంటి వేధింపులకు గురిచేస్తున్న వారికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మాకు తెలియజేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
UP: యూపీలో హర్యానా నటుడు అంకిత్ బలియాన్ హత్య
-
Sankranti 2027: అనిల్ రావిపూడికి ఈసారి టఫ్ ఫైట్.. 2027 సంక్రాంతి బరిలో బిగ్ వార్!
-
Nepal-Tibet Flood: వరదల్లో చిక్కుకున్న ఇషా ఫౌండేషన్‌కు చెందిన 77 మంది భక్తులు, రంగంలోకి సద్గురు
-
Bhatti Vikramarka : బొగ్గు దాటి బంగారం, రాగిపై సింగరేణి ఫోకస్.. భట్టి కీలక ఆదేశాలు
-
Toxic Makers: ‘ధురంధర్ 2’కు షాకిచ్చిన ‘టాక్సిక్’.. ఫ్యాన్స్‌కు మేకర్స్ కీలక విజ్ఞప్తి
ట్రెండింగ్
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్‌తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్‌చేస్తే..