NTV Telugu Site icon

Liquor Sales: మద్యం కిక్కు.. రేట్లుపెరిగినా నో ప్రాబ్లం

Liquor Tg

Liquor Tg

తెలంగాణలో మద్యం కిక్కు బాగా ఎక్కువైంది. ధరలు పెరిగినా మందుబాబుల తీరు మారడం లేదు. ధర ఎంతైనా తాగేస్తాం.. ఊగేస్తాం అన్నట్టుగా వుంది వారి తీరు. మే నెలలో భారీగా మద్యం అమ్మకాలు జరిగాయని ఎక్సైజ్ శాఖ చెబుతోంది. గత నెల కన్నా పెరిగిన మద్యం సేల్స్ మందుబాబుల దూకుడుకు సంకేతంగా చెబుతున్నారు.

మద్యం ధరలు పెంచితే అమ్మకాలు తగ్గుతాయని భావించారు. కానీ అలాంటిదేం లేదని తేలిపోయింది. ఏప్రిల్ నెలలో 27 లక్షల 92వేల721 లిక్కర్ కేసులు డిపోల నుండి అమ్ముడు కాగా 49 లక్షల 92వేల 697 బీర్ కేసులు అమ్ముడుపోయాయి. ఏప్రిల్ నెలలో మొత్తం 2,701 కోట్ల అమ్మకాలు డిపోల నుండి జరిగాయని అధికారులు చెబుతున్నారు. మే నెలలో డిపోల నుండి మద్యం అమ్మకాలు మూడు వేల కోట్లు దాటాయి. మేలో 29,54,149 కేసుల లిక్కర్, 55 లక్షల 70 వేల కేసుల బీర్ల అమ్మకాలు జరిగాయని తెలుస్తోంది.

మేనెల 19 వ తేదీ నుంచి మద్యం ధరలు పెరిగాయి. డిసోల నుండి 3069.3 కోట్ల అమ్మకాలు జరిగాయి. అయినా సేల్స్ పైన ఎలాంటి నెగటివ్ ప్రభావం పడలేదంటున్నారు అధికారులు. ప్రతి నెలా మద్యం అమ్మకాలు పెరగడంతో అధికారులు ఖుషీ అవుతున్నారు. మద్యం బాబులు మాత్రం అప్పు చేసేనా మంచి బ్రాండ్ మద్యం తాగేస్తున్నారు. మద్యం అమ్మకాలతో పాటు బిర్యానీ అమ్మకాలు కూడా భారీగా పెరిగాయి. ఆన్ లైన్ అందుబాటులోకి రావడంతో క్షణాల్లో బిర్యానీ ఆర్డర్ చేసి బిర్యానీ తింటూ మందేస్తూ చిందేస్తున్నారు మందుబాబులు.

Liquor: మద్యం ధరలపై జీవో జారీ.. ఇవాళ్టి నుంచే కొత్త ధరలు..