తెలంగాణలో మరోసారి మద్యం ధరలను పెంచేసింది ప్రభుత్వం.. ఇక, మద్యం ధరల పెంపుపై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.. ఆ ఉత్తర్వుల ప్రకారం.. పెరిగిన ధరలు ఇవాళ్టి నుంచే అమల్లోకి వచ్చేశాయి.. లిక్కర్‌పై 20 నుంచి 25 శాతం ధరలను పెంచింది.. రూ.200 లోపు ఎమ్మార్పీ ఉన్న లిక్కర్ పై క్వార్టర్‌కు 20 రూపాయలు, హాఫ్‌కి 40, ఫుల్ బాటిల్‌కి 80 రూపాయలు పెరగగా.. రూ. 200 కన్నా ఎక్కువ ఎమ్మార్పీ ఉన్న లిక్కర్ క్వార్టర్ కి 40 రూపాయలు, హాఫ్‌కి 80 రూపాయలు, ఫుల్ బాటిల్ కి 160 రూపాయలు పెంచారు. ఇక, వైన్ పైన క్వార్టర్ పది రూపాయలు, హాఫ్ 20 రూపాయలు, ఫుల్ 40 రూపాయలు పెరిగింది.. అన్ని రకాల బీర్లపై రూ.10 పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.. అయితే, తెలంగాణ ప్రభుత్వం రెండేళ్ల తర్వాత మద్యం ధరలు పెంచింది. కాగా, ఇప్పటికే పెట్రోల్, డీజిల్, గ్యాస్, కరెంట్, కూరగాయలు, నిత్యావసరాలు ఇలా.. అన్ని పెరగడంతో సాధారణ ప్రజలు భారంగా మారగా.. ఇప్పుడు మద్యం ప్రియులకు కూడా షాక్ తగిలినట్టు అయ్యింది.
Read Also: Hardik Patel: నిన్న కాంగ్రెస్‌కు గుడ్‌బై.. నేడు ఘాటు వ్యాఖ్యలు..