NTV Telugu Site icon

License Cancellation: మందుబాబులపై ఉక్కుపాదం.. లైసెన్సులు రద్దు..

Licence Cancel

Licence Cancel

License Cancellation: తెలంగాణ వ్యాప్తంగా న్యూ ఇయర్ సందర్భంగా రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. కొత్త సంవత్సరాన్ని స్వాగతం చెబుతూ మందుబాబులు లిక్కర్ సేల్స్ ను టాప్ లో నిలిపారు. ఇదిలా ఉంటే మరోవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ పై దృష్టిపెట్టింది పోలీస్, రవాణా శాఖ. శనివారం హైదరాబాద్ లో అన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులను నిర్వహించారు. దాదాపుగా చాలా చోట్ల మందుబాబులు పట్టుబడ్డారు.

Read Also: Tripti Dimri: ఆ హీరోయిన్ సోదరుడితో తృప్తి డేటింగ్.. నిజమేనంటూ నటి బాంబ్

నూతన సంవత్సర వేడకల సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఉక్కుపాదం మోపింది రవాణా శాఖ. మొత్తం 5819 మంది వాహనాదారులు లైసెన్సులను రద్దు చేసింది రవాణా శాఖ, మద్యం తాగి వాహనం నడిపిన కారణంగా వారందరి లైసెన్సులను రద్దు చేసింది. నార్త్ జోన్ లో 1103, సౌత్ జోన్ లో 1151, ఈస్ట్ జోన్ 510, వెస్ట్ జోెన్ 1345 మంది లైసెన్సులు రద్దు అయ్యాయి. 2021 ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది కొత్తగా 3,220 వాహనదారుల లైసెన్సులను రద్దు చేసింది. హైదారాబాద్ ట్రాఫిక్ పోలీస్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో సంజీవరెడ్డి నగర్ లో 73, పంజాగుట్టలో-51, బంజారా హిల్స్ -48, జూబ్లీ హిల్స్ -49 కేసులు నమోదు అయ్యాయి.

Show comments