NTV Telugu Site icon

BRS Leaders Fight: ఓవైపు జెండా ఆవిష్కరణ.. మరోవైపు బీఆర్‌ఎస్‌ లీడర్ల ఫైట్

Brs Leaders Fight

Brs Leaders Fight

BRS Leaders Fight: దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో.. వికారాబాద్ లో దోమ ఎంపీడీఓ కార్యాలయంలో ఇద్దరు బీఆర్ఎస్ లీడర్ల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో వార్త సంచలనంగా మారింది. వికారాబాద్‌లోని దోమ ఎంపీడీఓ కార్యాలయంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో అధికార పార్టీ నేతల మధ్య వర్గపోరు చోటుచేసుకుంది. జెండా ఆవిష్కరణకు సిద్ధమైన ఎంపీపీ అనసూయను వైస్ ఎంపీపీ మల్లేశం అడ్డుకున్నారు. ఎంపీడీవో జెండాను ఆవిష్కరించాలి. జెండాను ఎందుకు ఆవిష్కరిస్తున్నారు? అని ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎంపీపీ కుమారుడు రాఘవేందర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ మల్లేశం మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఓ వైపు ఎంపీడీఓ జెండాను ఆవిష్కరిస్తూనే మరోవైపు ఇద్దరు నేతలు తిట్టడం చర్చనీయాంశంగా మారింది.

Read also: Revanth Reddy: కేసీఆర్ ని దారిలోకి తెస్తా అన్న ఈటెల.. ఇప్పుడు కేసీఆర్ దారిలోనే..

అధికార పార్టీ నేతల తీరుతో జాతీయ జెండా ఆవిష్కరణ సభకు తీవ్ర అవమానం జరిగిందని స్థానికులు అంటున్నారు. ఇద్దరూ ఒకే పార్టీకి చెందిన నేతలే అయినా గత కొన్ని రోజులుగా ఎమ్మెల్యే మహేష్ రెడ్డికి ఎంపీపీ అనసూయ దూరం పాటిస్తున్నారు. ఉమ్మడి రంగారెడ్డి డీసీసీబీ చైర్మన్ మనోహర్ వద్ద ఉండి బీఆర్ ఎస్ లో మరో గ్రూపుగా కొనసాగుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో వారి వర్గపోరుకు గణతంత్ర వేడుకలు వేదికగా మారడంతో తీవ్రంగా మండిపడుతున్నారు స్థానికులు.
Balakrishna: నాకు 60 సంవత్సరాలు అంటే వాడికి దబిడి దిబిడే