NTV Telugu Site icon

Barkat Ali khan Funeral: నేడు అధికార లాంఛనాలతో చివరి నిజాం అంత్యక్రియలు

Mukharam Jah

Mukharam Jah

Barkat Ali khan Funeral: టర్కీలోని ఇస్తాంబుల్‌ లో ఎనిమిదో నిజాం బర్కత్‌ అలీఖాన్‌ ముకరం ఝా బహదూర్‌ గత శనివారం రాత్రి మరణించిన సంగతి తెలిసిందే.. ఆయన చివరి కోరిక మేరకు ఆయన అంత్యక్రియలు హైదరాబాద్‌ లో నిర్వహించనున్నారు. ఎనిమిదో నిజాం భౌతిక కాయాన్ని ఆయన తండ్రి అజమ్‌ ఘా సమాధి పక్కనే ఖననం చేయనున్నారు. ముకరం ఝా బౌతిక కాయాన్ని ఇస్తాంబుల్‌ నుంచి నిన్న సాయంత్రానికి ప్రత్యేక విమానంలో నగరానికి తీసుకువచ్చి.. అక్కడి నుంచి పాతబస్తీలో ఉన్న చౌమహల్లా ప్యాలెస్‌కు భౌతిక కాయాన్ని తరలించారు. ఇవాళ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు సాధారణ ప్రజలకు ఆయన భౌతిక కాయాన్ని చూసే అవకాశం కల్పిస్తారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత మక్కా మసీదుకు తరలిస్తారు. ముకర్రమ్ ఝా కోరిక మేరకు ఆయన తండ్రి అజమ్ ఝా సమాధి పక్కనే అంత్యక్రియలు చేస్తారు. కాగా.. మక్కా మసీదులోనే దక్షిణ భాగంలో అజమ్ ఝా సహా అసఫ్ జాహీ కుటుంబ సభ్యుల సమాధులు ఉన్నాయి..అక్కడే ముకరం ఝా భౌతిక కాయాన్ని కూడా ఖననం చేయనున్నారు.

Read also:

హైదరాబాద్ ఏడవ నిజాం ఉస్మాన్ అలీఖాన్‌కు ఆజం ఝా, మౌజంఝా అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో 7వ నిజాం తన మొదటి కొడుకు కుమారుడైన ముకరం ఝాను 8వ నిజాంగా ప్రకటించాడు. 1971లో భారత ప్రభుత్వం కిరీటాలను రద్దు చేసే వరకు ముకరం ఝా అధికారికంగా హైదరాబాద్ యువరాజుగా పిలిచేవారు. ఇక ప్రిన్స్ ఆఫ్ హైదరాబాద్ కు నలుగురు భార్యలు, ఐదుగురు పిల్లలు ఉన్నారు. ముకరం ఝా తండ్రి ఆజాం ఝా, తల్లి దుర్రె షెహవార్.

ఇస్తాంబుల్‌లో అద్దె ఇంట్లో మరణం: 

ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆ సమయంలో గొప్ప సంపదతో ప్రపంచ పాలకుడు. అతని మనవడు, ఎనిమిదవ నిజామాన్ ముకరం ఝా, చిన్న వయస్సులోనే ప్రపంచ పరిపాలకుడయ్యాడు. అదే సమయంలో వారసత్వ ఆస్తితో దివాళా తీసి విలాసాలు, డాబు దర్పాలకు దిగినట్లు చెబుతున్నారు. నలుగురు భార్యలతో విభేదాల కారణంగా పలు కేసులు, ఆస్తి తగాదాలతో ఇబ్బంది పడ్డాడని చెబుతున్నారు. హైదరాబాద్‌లోని అతని పిల్లలు, బంధువులు ఆస్తి కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ ఆస్తుల విక్రయాలపై కోర్టు ఆంక్షలు విధించింది. అలా ఎనిమిదో నిజాంకు దాదాపు చేతిలో డబ్బులు కూడా లేని స్థితి ఎదురైందని చెబుతారు. ఆస్ట్రేలియాకు చెందిన రచయిత, పరిశోధకుడు రీసెర్చర్ జాన్ జుబర్‌జి మాట్లాడుతూ.. వారు ఇస్తాంబుల్‌లో డబుల్ బెడ్‌రూమ్ ఇంటిని అద్దెకు తీసుకొని ఉండేవారని పేర్కొన్నారు. ఆయన The Last Nizam అనే పుస్తకాన్ని రాశారు. ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ఇండియాస్ గ్రేటెస్ట్ ప్రిన్స్లీ స్టేట్ (The Raise and Fall of India’s Greatest Princely State) గురించి ఉన్న ఈ పుస్తకంలో ఎనిమిదో నిజాం అద్దె ఇంటికే పరిమితమైనట్లుగా రాశారు.

Read also: CM KCR : నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్‌.. మరో ముగ్గురు సీఎంలు

చౌమహల్లా ప్యాలెస్‌లో హైదరాబాద్ సంస్థానపు చివరి నిజాం మీర్ బర్కత్ అలీఖాన్ సిద్దికీ ముకర్రం ఝా పార్థివదేహానికి సీఎం కేసీఆర్ పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సీఎం అల్లాను ప్రార్థించారు. విషాదంలో ఉన్న నిజాం కుటుంబ సభ్యులను సీఎం ఓదార్చారు. చివరి నిజాం మృతిపై తెలంగాణ సీఎం కేసీఆర్ సంతాపం తెలిపారు. ఆయన మృతి పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నిజాం చేసిన సామాజిక సేవలకు గుర్తుగా అంత్యక్రియలను అధికార లాంఛనాలతో ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఈనేపథ్యంలో చివరి నిజాం అంత్యక్రియలు ఇవాళ ఘనంగా నిర్వహించనున్నారు.
Sridevi First Husband: శ్రీదేవి మొదటి భర్తని ఎందుకో వదిలేసిందో తెలుసా?