Site icon NTV Telugu

Kandala Upender Reddy: బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే కందాలపై కేసు.. భూకబ్జా ఆరోపణలు

Kandala

Kandala

Kandala Upender Reddy: బీఆర్ఎస్ పార్టీకి చెందిన పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డిపై భూకబ్జా కేసు నమోదైంది. హైదరాబాద్ బంజారా హిల్స్ లో ఓ స్థలానికి సంబంధించిన వ్యవహారంలో షేక్‌పేట్ తహసీల్దార్ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పాలేరు మాజీ జీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డిపై బంజారాహిల్స్ లో కేసు నమోదైంది. బంజారాహిల్స్ రోడ్ నం.3లో ప్లాట్ నంబరు 8-c పేరుతో ఉన్న 2285 చదరపు మీటర్ల ప్రభుత్వ భూమిని ‘దీప్తి అవెన్యూ ప్రైవేట్ లిమి టెడ్ సంస్థకు చెందిన ఉపేందర్రెడ్డితో పాటు ఇతరులు కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టారు. గతంలో ఫ్లాట్ నం.8-డీలో షౌకతున్నీసా పేరుతో ఉన్న స్థలాన్ని కొనుగోలు చేసిన ఉపేందర్రెడ్డి ‘8-Cలో స్థలాన్ని తమదిగా చెబుతున్నారు. ఈ సర్వే నంబరులో మొత్తం 2.25 ఎక రాలు ఉండగా అందులో అత్యధిక భాగం షౌకత్నగర్ బస్తీగా ఏర్పడగా 2185 చదరపు మీటర్ల ప్రభుత్వ స్థలం ఖాళీగా ఉంది.

Read also: Mudragada Padmanabham: ముద్రగడ త్వరలోనే ఏదో ఒక పార్టీలో చేరుతారు.. నేను కూడా పోటీ చేస్తా: గిరిబాబు

ఈ స్థలంలో అవెన్యూ సంస్థ గతంలోనూ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నించగా అప్పటి తహసీల్దార్ స్థలాన్ని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుని ల్యాండ్ బ్యాంక్ లో ఉంచారు. దీనిపై సంస్థ ప్రతినిధులు కోర్టును ఆశ్రయించగా యథాతథస్థితిని కొనసాగించాలని 2010లో కోర్టు ఆదేశించింది. కాగా, తహసీల్దార్ అనితారెడ్డి విధుల్లో భాగంగా స్థలాన్ని పరిశీలించగా ప్రభుత్వ భూమి బోర్డు తొల గించి, షెడ్లు నిర్మించి వైన్షాప్ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బంజారాహిల్స్ పోలీసుల సహకారంతో రాత్రి తహసీల్దార్ లోపాటు సిబ్బంది అక్కడికి చేరుకొని అక్రమ నిర్మాణాలన్నింటినీ సీజ్ చేశారు. తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుతో ఉపేందర్ రెడ్డి తదితరు సెక్షన్లు 447, 427, 467, 468, 471, సెక్షన్ 3 ఆఫ్ పీడీపీపీ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kota Bommali PS : ఓటీటీలోకి వచ్చేస్తున్నా ‘కోట బొమ్మాళి పీఎస్’.. అఫీషియల్ అప్డేట్ ఇచ్చిన ఆహా..

Exit mobile version