Site icon NTV Telugu

హైదరాబాద్‌లో ఎకరం భూమి రూ.24.22 కోట్లు.. ఎక్కడో తెలుసా?

తెలంగాణలో భూముల ఆస్తుల విలువను పెంచుతూ రెండు రోజుల క్రితం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా భూముల ధరలను ఖరారు చేస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. తాజా ఉత్తర్వుల ప్రకారం.. హైదరాబాద్ మహానగరంలోని సరూర్ నగర్, బహదూర్‌పురా మండలాల్లో ఎకరం భూమి రూ.22.02 కోట్లుగా ఉన్న ప్రభుత్వ విలువను ఏకంగా రూ.24.22 కోట్లకు పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

Read Also: తెలంగాణ‌లో ఫిబ్ర‌వరి 1 నుంచి స్కూళ్లు రీ ఓపెన్‌

ఆ తర్వాతి స్థానంలో కూకట్‌పల్లి, బాలానగర్, మూసాపేట మండలాల్లో ప్రస్తుతం ఎకరం భూమి రూ.18.87 కోట్లుగా ఉంది. అదే సమయంలో కర్మన్ ఘాట్‌లో ఎకరం రూ.13.55 కోట్లుగా పలుకుతోంది. మాదాపూర్‌లో ఎకరం భూమి రూ.12.58 కోట్లు ఉండగా దాని విలువను మరో 10 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అంతేకాదు… ఐటీ కారిడార్‌కు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే గబ్చిబౌలి, మియాపూర్, నానక్ రాం గూడలో ఎకరం రూ.9.43 కోట్లు, నిజాంపేట, అత్తాపూర్ ప్రాంతాలలో రూ.6.29 కోట్లు, నాగోల్, బండ్లగూడలో రూ.5.03 కోట్లుగా ఉన్న ప్రభుత్వ భూమి విలువను మరో 20 శాతం పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Exit mobile version