ఇప్పటికే తెలంగాణ టీడీపీకి రాజీనామా చేసిన ఎల్. రమణ ఇవాళ కారెక్కారు… తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన రమణ.. ఈ మధ్యే సీఎం కేసీఆర్‌తో చర్చించిన తర్వాత పార్టీకి రాజీనామా చేశారు.. కాసేపటి క్రితం తెలంగాణ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.. ఈ సందర్భంగా ఎల్. రమణకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు సీఎం కేసీఆర్… రమణతో పాటు ఆయన అనుచరులు కూడా గులాబీ గూటికి చేరారు. కాగా, ఇటీవలే టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రమణ టీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్న సంగతి తెలిసిందే.. ఇక, ఈటల రాజీనామా తర్వాత.. బీసీ నేతలపై ఫోకస్ పెట్టిన టీఆర్ఎస్.. ఎల్. రమణను ఆహ్వానించింది.. ఆయనను పార్టీలోకి తీసుకురావడానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కృషిచేశారు.
కారెక్కిన ఎల్. రమణ.. కండువా కప్పి ఆహ్వానించిన కేసీఆర్

Ramana