NTV Telugu Site icon

CM KCR: సీఎం వద్దకు కూసుకుంట్ల, నల్గొండ లీడర్లు..

Kcr

Kcr

మునుగోడ ఉప ఎన్నికల్లో విక్టరీ కొట్టింది గులాబీ పార్టీ.. ఆ పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌ రెడ్డి 10,309 ఓట్ల మెజార్టీతో.. ఉప ఎన్నికకు కారణమైన బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిపై విజయం సాధించారు.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు సాధించిన ఈ విజయంతో కారు పార్టీ శ్రేణుల్లో జోష్‌ పెరిగింది.. మునుగోడులో మొత్తం 2,25,192 ఓట్లు పోలైతే.. టీఆర్ఎస్‌కు 42.95 శాతం ఓట్లు, బీజేపీకి 38.38 శాతం ఓట్లు, కాంగ్రెస్‌కు 10.58 శాతం ఓట్లు.. ఇతరులకు 08.09 శాతం ఓట్లు దక్కాయి.. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ ఎన్నికలపై సీఎం కేసీఆర్‌ ప్రత్యేకంగా ఫోకస్‌పెట్టారు.. మంత్రులు కేటీఆర్‌, జగదీష్‌రెడ్డి, హరీష్‌రావు.. ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఇలా అందరినీ బరిలోకి దింపారు.. ఇదే ఆ పార్టీకి కలిసివచ్చింది.. మునుగోడు గెలుపుతో.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీ వరుసగా మూడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్‌ కొట్టింది.. అయితే, ఇవాళ సీఎంను కలవనున్నారు మునుగోడులో విజయం సాధించిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, నల్గొండ జిల్లా ప్రతినిధులు.

Read Also: KA Paul: పాల్‌ని జోక్‌గానే తీసుకుంటున్నారా..? ఆయనకు ఏం కావాలి? మనం ఏం నేర్చుకోవాలి..?

ఇవాళ మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు రానున్నారు మునుగోడు కొత్త ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. సీఎం కేసీఆర్‌ను కలిసి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపనున్నారు.. ఆయన్ను సీఎం కేసీఆర్‌ అభినందించనున్నారు.. అయితే, కూసుకుంట్లతో పాటు ప్రగతి భవన్‌కు నల్గొండ జిల్లా ప్రజా ప్రతినిధులు కూడా రాబోతున్నారు.. ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేసిన మంత్రి జగదీష్‌రెడ్డితో పాటు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు హాజరు అవుతారని తెలుస్తోంది. మునుగోడులో పార్టీని గెలిపించి కారు గేర్ మార్చేందుకు దోహదపడిన అందిరినీ కేసీఆర్‌ అభినందించనున్నారట.. అంతేకాదు.. టీఆర్ఎస్‌ పార్టీ పేరు బీఆర్‌ఎస్‌గా మారుస్తూ తీర్మానం చేసిన తర్వాత.. ఆ పార్టీ ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో విక్టరీ కొట్టడం కూడా ఆ పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపిందని చెబుతున్నారు.