NTV Telugu Site icon

Kunamneni Sambasiva Rao: బండి సంజయ్ నీ స్థాయి ఎంత? బీజేపీ లేకపోతే హిందూ మతానికి రక్షణ లేదా?

Kunamneni Sambasiva Rao

Kunamneni Sambasiva Rao

Kunamneni Sambasiva Rao Fires On Bandi Sanjay And BJP: కమ్యూనిస్టు పార్టీని తాకట్టు పెట్టారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘బండి సంజయ్.. నీ స్థాయి ఎంత? నువ్వు మాకు సూక్తులు చెప్తావా?’ అంటూ ధ్వజమెత్తారు. కమ్యూనిస్టు పార్టీని తాకట్టు పెట్టామని చెప్పడానికి సిగ్గు లేదా? అని మండిపడ్డారు. కమ్యూనిస్టుల మీద ఉమ్మేస్తే సూర్యునిపై వేసినట్టేనని అన్నారు. అధికారం కోసం పశువుల గడ్డి తినే మీరు.. కమ్యూనిస్టు పార్టీనే అంటారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులను తిడితే, తల్లికి పెరు పెట్టినట్టు అవుతుందని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ పేరు రోజు తలచుకోండని, అలా చేస్తే కనీసం పుణ్యమైనా వస్తుందని సూచించారు. తమ ప్రధాన శతృవు బీజేపీ మాత్రమేనని, బీజేపీ సిద్ధాంతంపై తమకు కోపమని స్పష్టం చేశారు. మనుషుల మధ్య మతాల కుమ్ములాట తెస్తారా? బీజేపీ లేకపోతే హిందూ మతానికి రక్షణ లేదా? మతం పేరుతో జనాన్ని హింసించకండి అని హితవు పలికారు.

Raviteja73: ప్రతి ధ్వని, ప్రకంపనం అంటున్నారు.. మా రవన్నను ఏం చేస్తున్నారు బ్రో

ఇదే సమయంలో.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో కమ్యూనిస్టు పార్టీ ప్రస్తావన లేకపోవడంపై కూనంనేని అసంతృప్తి వెళ్లగక్కారు. సీపీఐ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని అనేకసార్లు స్వయంగా సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. ఈరోజు చరిత్ర ఏదీ మర్చిపోవద్దని సూచించారు. అనేకమంది పిల్లలు, జయశంకర్ లాంటి వాళ్ళు ఎంతోమంది చనిపోయారని.. అందరూ కలిస్తేనే తెలంగాణ వచ్చిందని తెలిపారు. గాలి, వెలుతురు ఉన్నంతకాలం.. కమ్యూనిజం పార్టీ ఉంటుందన్నారు. కమ్యూనిజం రథచక్రాల కింద పడితే నలిగిపోతారని హెచ్చరించారు. కమ్యూనిస్టు పార్టీ అయిపోయిందంటూ చాలామంది అవాకులు చవాకులు వెళుతున్నారని.. అలాంటి వాళ్లందరూ భద్రాదిలో నిర్వహించిన ప్రజాగర్జన గ్రౌండ్‌కి వచ్చి కమ్యూనిస్టు పార్టీ బలమేంటో చూడండని అన్నారు. కమ్యూనిస్ట్‌లు లేకుండా ఈ దేశంలో ఏ హక్కు సాధ్యం కాదన్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను ఖమ్మం తీసుకొచ్చినప్పుడు.. ముందుగా పలకరించింది తామేనని గుర్తు చేశారు. ఉద్యమంలో కటకటాల్లో ఉన్నామని, కమ్యూనిస్టులపై ఎన్నో కేసులు ఉన్నాయని చెప్పారు.

Vikarabad Sireesha Case: శిరీష కేసులో కొత్త ట్విస్ట్.. హత్య చేసింది అతడేనా?

ఈ రోజు దశాబ్ది ఉత్సవాల్లో తమ పెరు లేదు, ఊరు లేదని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. కమ్యూనిస్టు పార్టీల చరిత్ర చరిపితే చరిగిపోదని, కమ్యూనిస్టుది రక్తంతో రాసిన చరిత్ర అని చెప్పారు. పోరాటాలకు ఓనమాలు దిద్దింది ఎర్రజండా అని.. పోడు ఉద్యమం కూడా కమ్యూనిస్టులు కాకుండా ఇంకెవరు చేయలేరని తేల్చి చెప్పారు. ఖమ్మం జిల్లా కమ్యూనిస్టు పార్టీల కంచుకోట అని ఉద్ఘాటించారు.

Show comments