Site icon NTV Telugu

Big News : రాజ్‌ భవన్‌ ముట్టడిలో ఉద్రిక్తత.. కూనంనేని, చాడ అరెస్ట్‌..

Kunamneni

Kunamneni

గవర్నర్‌ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ బుధవారం ‘చలో రాజ్‌భవన్‌’ కార్యక్రమానికి సీపీఐ పిలుపునిచ్చింది. అయితే.. దీనిలో భాగంగా.. ఈ రాజ్‌భవన్‌ ముట్టడిలో భారీగా సీపీఐ నాయకులు పాల్గొన్నారు. ఈ క్రమంలో రాజ్‌భవన్‌ ముట్టడికి వస్తున్న సీపీఐ నాయకులను ఖైరతాబాద్‌ సర్కిల్‌లో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో.. అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకొని, పోలీసులకు సీపీఐ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో.. పోలీసులు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, చాడ వెంకట్‌ రెడ్డిలను పోలీసులు అరెస్ట్‌ చేశారు.
Also Read : Chellaboina venugopal: బీసీల ఆత్మగౌరవాన్ని నిలిపిన వ్యక్తి సీఎం జగన్

అయితే.. కూనంనేని, చాడల అరెస్ట్‌పై సీపీఐ కార్యకర్తలు నిరసనలు తెలుపుతున్నారు. ఇదిలా ఉంటే.. గవర్నర్‌ వ్యవస్థ ప్రజాస్వామ్య విలువలను కాపాడేలా పనిచేసినట్టు ఇప్పటివరకు ఆధారాలు లేవని, గవర్నర్‌ వ్యవస్థతో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని, అందుకే ఈ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు కూనంనేని. ప్రస్తుత రాష్ట్ర గవర్నర్‌ తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలిగా పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు.

అంతకు ముందు ఎన్టీవీతో కూనంనేని మాట్లాడుతూ.. కవిత పై కేసు రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, అసలు లిక్కర్ కేసు ఏంటో అర్థం కావడం లేదన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు సుజనా చౌదరి, సీఎం రమేష్ లపై దాడులు చేశారన్నారు. వాళ్ళు బీజేపీ లో చేరగానే పునితులు అయ్యారని, షర్మిలకు మోడీ ఫోన్ చేసి పలకరించే సమయం ఉంది కానీ… బీజేపీ రాష్ట్రాల్లో మహిళలపై దాడులు.. హత్యలు చేసిన బాధితులను పరామర్శించే సమయం లేదన్నారు. మోడీ రాజనీతిజ్ఞుడు కాదని, గవర్నర్ వ్యవస్థతో ప్రయోజనం లేదన్నారు. ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువ అన్నారు.

Exit mobile version