హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తథ్యమని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడిన ఆయన హుజురాబాద్ ఉప ఎన్నిక అభ్యర్థి బల్మూరి వెంకట్ గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వాస్తవానికి బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలే కుమ్మక్కై రాజకీయం చేస్తున్నాయని, తెలంగాణాలో ఒకరినొకరు తిట్టుకొని ఢిల్లీలో కలుస్తున్నారన్నారు. అంతేకాకుండా కేసీఆర్‌కు దళిత బంధు ఇచ్చే అలోచన లేదని, అది కేవలం ఎన్నికల జిమ్మిక్కేనన్నారు.
ఉప ఎన్నికలు ముగిసిన తరువాత దళిత బంధు ప్రస్తావన రాదంటూ హెద్దేవ చేశారు. కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా దళితబంధును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు ఎన్నికలు వచ్చినప్పుడే పథకాలు గుర్తుకు వస్తాయని విమర్శించారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.