Site icon NTV Telugu

KTR: తప్పుడు ఆరోపణలు చేస్తే లీగల్‌ నోటీసు పంపుతా.. కాంగ్రెస్‌ నేతలకు కేటీఆర్‌ వార్నింగ్‌

Ktr

Ktr

KTR: తప్పుడు ఆరోపణలు చేస్తే లీగల్‌ నోటీసు పంపుతా.. కాంగ్రెస్‌ నేతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ వార్నింగ్‌ ఇచ్చారు. మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాసరెడ్డి, కేకే మహేందర్ రెడ్డి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వీరికి లీగల్ నోటీసు పంపిస్తా అని హెచ్చరించారు. ఫోన్ ట్యాపింగ్ అంశంలో తనపై సిగ్గు లేకుండా , తప్పుడు ఆరోపణలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ఆరోపణలపై తనకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఒకవేళ అలా కాకుంటే.. చట్టపరంగా చర్యలు ఎదుర్కోవాలని హెచ్చరించారు. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే.. వారు ఎవరైనా సరే వారిపై లీగల్ నోటీసులు పంపిస్తానని తెలిపారు.

Read also: Nellore Politics: నెల్లూరులో బస్తీమే సవాల్.. రెడీయా..?

తాజాగా.. కుట్రపూరితంగా అసత్యాలను ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లపై క్రిమినల్ కేసులు పెడతామని కేటీఆర్ వార్నింగ్ ఇచ్చిన విషయం తెలసిందే. బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన యూట్యూబ్ ఛానళ్లు కొన్ని ఏలాంటి ఆధారాలు లేకుండా అడ్డగోలుగా, అసత్యాలను పదేపదే ప్రసారం చేస్తున్నాయనీ మండిపడ్డారు. ఇలాంటి యూట్యూబ్ ఛానళ్లపైన కఠినమైన న్యాయపరమైన చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఈ యూట్యూబ్ ఛానళ్లపైన పరువు నష్టం దావాలతో పాటు.. కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నందుకు క్రిమినల్ కేసులను కూడా నమోదు అయ్యేలా చూస్తామని హెచ్చరించారు.

Read also: Cyber Crime: ఇదో కొత్త జమ్తారా… 90 మంది అరెస్ట్, 48 ఫోన్లు, 82సిమ్ కార్డులు స్వాధీనం

ప్రజలను తప్పుదోవ పట్టించేలా.. వార్తల పేరుతో శుద్ద అబద్దాలను చూపిస్తున్నాయి. డబ్బులకు ఆశపడి ఇలాంటి నేరపూరితమైన, చట్టవిరుద్ధమైన వీడియోలను, ఫేక్ న్యూస్ లను ప్రచారం చేస్తున్నాయన్నారు. ఇది వ్యక్తిగతంగా నాతోపాటు, మా పార్టీని దెబ్బతీయాలన్న కుట్రలో భాగంగానే జరుగుతున్నదని భావిస్తున్నట్లు కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్రపూరిత అసత్య ప్రచారం పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని తెలంగాణ ప్రజలకు కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
Delhi: బీజేపీలో చేరకపోతే మమల్ని అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారు..

Exit mobile version