NTV Telugu Site icon

KTR: ఉద్యోగాల ప్రకటన ఎన్నికల ఎత్తుగడ.. ట్విట్టర్ లో కేంద్రంపై విమర్శలు

Ktr

Ktr

బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి. బీజేపీ పార్టీపై, కేంద్ర ప్రభుత్వం విధానాలపై టీఆర్ఎస్ పార్టీ నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రంపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ఇటీవల కేంద్రం 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించింది. దీనిపై ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు కేటీఆర్.

ప్రతపక్ష పార్టీలు, దేశంలోని నిరుద్యోగ యువత కేంద్రంపై భారీ ఒత్తిడి తీసుకువచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు కేటీఆర్. రాబోయే 18 నెలల్లో 10 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని మోదీ ప్రకటించారని.. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. ఆదే సమయంలో అనేక హమీలు ఇచ్చి తప్పారని.. మోదీని నమ్మడం కష్టం అని అన్నారు. ఎనిమిదేళ్లుగా రిక్రూట్మెంట్ ను పూర్తిగా నిర్లక్ష్యం చేసి, ఎన్నికల ఏడాది ముందు ఉద్యోగాలు ప్రకటించడంలో భారీ ఎత్తుగడ కనిపిస్తోందని కొన్ని భయాలు, ప్రశ్నలు ఉన్నాయని ట్వీట్ చేశారు. ముందుగా కేంద్ర ప్రభుత్వం ఖాళీగా ఉన్న స్థానాల సంఖ్యపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంజూరైన 60 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల్లో, రంగాల వారీగా, పీఎస్యూల వారీగా ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని ప్రశ్నించారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ చాలా చిన్న రాష్ట్రం అని.. గత 8 ఏళ్లలో మేము 1,35,000 ఉద్యోగాలు భర్తీ చేశామని మరో ఒక లక్ష ఉద్యోగాల నియామకం ప్రారంభించామని.. అదే నిష్పత్తిలో, 2014 నుంచి 140 కోట్ల మంది భారత జనాభా కోసం మోదీ ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని ప్రశ్నించారు. ప్రైవేటు రంగంలో 16 లక్షల ఉద్యోగాలు కల్పించామని.. ఈ 8 ఏళ్లలో పెట్టుబడుల ద్వారా కేంద్రం ఎన్ని ఉద్యోగాలు సృష్టించిందో మోదీ చెప్పాలని..దేశంలోని యువతకు బీజేపీ హామీ ఇచ్చిన విధంగా 16 కోట్ల ఉద్యోగాలు ఎప్పుడు లభిస్తాయో చెప్పాలని ట్విట్టర్ లో డిమాండ్ చేశారు. ఎన్డీఏ సర్కార్ నిర్లక్ష్య ప్రమాదకరమైన ఆర్థిక విధానాలకు ధన్యవాదాలు. గత ఎనిమిదేళ్లలో దేశంలోని యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన కోలుకోలేని నష్టం చేసిందని.. అన్యాయంపై ప్రధాని మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు.