BRS KTR: పార్లమెంటల్ ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బీఆర్ఎస్ దూకుడుపెంచింది. ఈనేపథ్యంలో నేడు వరంగల్ లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించనున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. హంటర్ రోడ్డులోని డి.కన్వెన్షన్ లో జరిగే బీఆర్ఎస్ మీటింగ్ లో కేటీఆర్ పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు ఊర్సు గుట్ట సమీపంలోని నాని గార్డెన్స్ లో జరిగే వరంగల్ తూర్పు కార్యకర్త సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారని అన్నారు. ప్రజల మద్దతుతో వరంగల్ గడ్డపై బీఆర్‌ఎస్ జెండాను ఎగురవేస్తామన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెదవి విరుస్తూ రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయన్నారు. రాష్ట్రానికి జరుగుతున్న తీవ్ర అన్యాయంపై పార్లమెంటులో తెలంగాణ వాణిని బలంగా వినిపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
Read also: Brij Bhushan: బ్రిజ్భూషణ్కు టికెట్ నిరాకరించిన బీజేపీ.. ఎందుకో తెలుసా..?
దీనికి ప్రజలు పూర్తి మద్దతు తెలపాలి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం ఉక్కు పరిశ్రమ, మామునూరు విమానాశ్రయం పునరుద్ధరణ సహా పలు మూతపడిన పరిశ్రమలను తెరిపించేందుకు పోరాడనున్నారని అన్నారు. ఆజంజాహీ మిల్లు మూతపడడంతో ఇక్కడి ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేందుకు కేసీఆర్ టెక్స్ టైల్ పార్కును నిర్మించారన్నారు. భూపాలపల్లి జిల్లాలో బొగ్గు సంబంధిత పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తామన్నారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తే ప్రస్తుత ప్రభుత్వాలు సంక్షేమాన్ని వృథా చేశాయన్నారు. కాంగ్రెస్, బీజేపీలకు వరంగల్ ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి. పోటీ చేసిన అభ్యర్థుల చరిత్రను ప్రజలు పరిశీలించాలని అన్నారు.
Birthday Cake: కేక్ తిని బాలిక మృతి కేసు.. మరణానికి కారణం తెలిసి అంతా షాక్!