KTR: ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఎంపిక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నేతలకే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
56 కేసులు, 74రోజుల జైలు జీవితం.. ఇది కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి చరిత్ర అన్నారు. ఐదు నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బ్లాక్ మైలర్ ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా రంగంలోకి దింపిందన్నారు. ఎమ్మెల్సీగా తీన్మార్ మల్లన్న ఎంపిక భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నేతలకే ప్రమాదం ఉందన్నారు. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండా 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని నిరుద్యోగులను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్లు ఆలోచించి ఓటు వేయాలని తెలిపారు.
Read also: Mahbubabad: చేపల కోసం ఎగబడ్డ గ్రామస్తులు.. పుష్కరాన్ని తలపించిన నెరడ పెద్ద చెరువు
ఎన్నికల హామీకి విరుద్ధంగా సన్న వడ్లకు మాత్రమే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించిన ఇది కపట కాంగ్రెస్ బ్రాండ్ మోసం, దగా, వంచన అని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీ కార్డులో వరి పంటకు రూ. 500 బోనస్ ప్రకటించారు. ప్రచారంలో ప్రతి గింజను అని ఊదరగొట్టి.. ప్రభుత్వంలోకి రాగానే చేతులెత్తేస్తారా అని నిలదీశారన్నారు. ఇది ప్రజల పాలన కాదు, రైతు వ్యతిరేక పాలన అంటూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. నిన్నమొన్నటి వరకు సాగునీరు ఇవ్వక, కరెంట్ కోతలతో పంటలను ఎండబెట్టి, కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయక, అకాల వర్షాలు కురవక వానలు కురిశాయి. రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఏటా రూ. 15,000 రైతు భరోసా.. ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు రూ.12 వేలు ఇవ్వలేదన్నారు.
Telangana VCs: నేటితో ముగియనున్న 10 యూనివర్సిటీ వీసీల పదవీకాలం..
