NTV Telugu Site icon

KTR: కవిత కి నెక్ట్ వీక్ బెయిల్ వస్తుంది.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు..

Ktr

Ktr

KTR: ఎమ్మెల్సీ కవిత నెక్ట్‌ వీక్‌ బెయిల్‌ వస్తుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ చిట్ చాట్ లో తెలిపారు. కవిత హెల్త్ సిక్ అయ్యిందని అన్నారు. కవిత ఇప్పటి వరకు పదకొండు కేజీ ల బరువు తగ్గిందని అన్నారు. కవిత బెయిల్ ప్రాసెస్ జరుగుతుందని.. నెక్ట్ వీక్ బెయిల్ వస్తుందన్నారు. కవితరకు బీజేపీ బెయిల్‌ ఇప్పి్స్తుందనే కథనాలపై కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితకు బీజేపీ ఎందుకు బెయిల్ ఇప్పిస్తుంది? అని మండిపడ్డారు. ఇలాంటి వార్తలు (రవి ప్రకాష్ కు) రాసిన వారిపై లీగల్ నోటీసు పంపిస్తామన్నారు. బేస్ లెస్ వార్తలు వేస్తున్నారని మండిప్డడారు. యూ ట్యూబ్ లో కూడా రాకుండా సస్పెండ్ చేయిస్తామన్నారు. అయితే కవితకు వచ్చే వారం బెయిల్ వస్తుందని కేటీఆర్ చిట్ చాట్ వేదికగా ప్రకటించడంతో ఈ వార్త రాష్ట్రంలో సంచలనంగా మారింది.

Read also: Hyderabad: బిగ్‌ అలెర్ట్‌.. 4 రోజులు ఫ్లైఓవర్ ​బంద్..! ఎక్కడంటే..

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కవితను కల్వకుంట్ల సోదరుడు, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కలిశారు. మంగళవారం (ఆగస్టు 7) మాజీ మంత్రి హరీశ్‌రావుతో కలిసి కవితను కలిశారు. దాదాపు 15 నిమిషాల పాటు ఆమెతో మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. మూడు రోజులుగా కేటీఆర్ ఢిల్లీలోనే మకాం వేశారు. ఆయనతో పాటు మాజీ మంత్రులు హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్‌లు కూడా ఉన్నారు. కేటీఆర్, హరీశ్ శనివారం రాత్రి ఢిల్లీకి చేరుకోగా, ఇతర నేతలు ఆదివారం వచ్చారు.

Read also: Bus Booking: ఆర్టీసీ బంఫర్ ఆఫర్.. పెళ్లిళ్ల కోసం బస్ బుక్ చేసుకుంటే భారీ డిస్కౌంట్‌..

అయితే ఢిల్లీలో కేటీఆర్, హరీష్ రావులు ఏం చేస్తున్నారు, ఎవరిని కలుస్తున్నారు అనే విషయాలను మాత్రం గోప్యంగా ఉంచుతున్నారు. సోమవారం కవితతో భేటీ ఉంటుందని తొలుత వార్తలు వచ్చినా.. పార్టీ ఫిరాయించిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించే అంశంపై కేటీఆర్, హరీశ్ తదితర నేతలు న్యాయ నిపుణులతో సమావేశమైనట్లు వార్తలు వచ్చాయి. పార్టీ. ఇక మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ జన్మదిన వేడుకలను బీఆర్‌ఎస్ నాయకుడి ఇంట్లో ఘనంగా నిర్వహించి వీడియో సందేశం పంపారు. మరోవైపు, X వేదికపై స్పందిస్తూ ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే..
Jagtial Crime: గురుకుల పాఠశాలలో విద్యార్థుల వరుస మరణాలు.. పది రోజుల్లో ఇద్దరు మృతి