Site icon NTV Telugu

KTR: కేసీఆర్ వస్తే నీళ్లు, కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు అని ముందే చెప్పాము..

Ktr

Ktr

KTR: గత ఎన్నికల సమయంలో కేసీఆర్ వస్తే నీళ్లు, కాంగ్రెస్ వస్తే కన్నీళ్లు అని చెప్పామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడే అదే పరిస్థితి కనిపిస్తోందన్నారు. గ్రామాల్లో, పట్టణాల్లో నీళ్ల కోసం తల్లడిల్లి పోతున్నారని తెలిపారు. హైదరాబాద్ లో నీటి కోసం యుద్ధాలు మొదలు అయ్యాయన్నారు. ఈ అసమర్థ సీఎం దన వనరులు ఢిల్లీ తరిలించే ప్రయత్నం తప్ప జల వనరులు తెచ్చే ప్రయత్నం చేయట్లేదన్నారు. మేము 38 వేల కోట్లతో మిషన్ భగీరథ చేపట్టినామన్నారు. దాని నిర్వహణ కూడా కాంగ్రెస్ పార్టీ చేయలేక పోతుందన్నారు.

Read also: JEE Main: రేపటి నుంచి జేఈఈ మెయిన్‌ -2 పరీక్షలు..

ఒక అసమర్థ ముఖ్యమంత్రి డబ్బు తరలింపు గురించి పట్టించుకోడు, నీటి వనరులను తరలించడం గురించి కాదు. సాగునీరు లేక తాగునీరు లేక గ్రామీణ ప్రజలు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మూడు, నాలుగు రెట్లు చెల్లించి ట్యాంకర్లను బుక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వేసవి ప్రారంభంలోనే తాగునీటి కోసం కష్టాలు మొదలయ్యాయి. ఇది సహజ కరువు కాదు.. వైఫల్యాల కాంగ్రెస్ సృష్టించిన కొరత. పార్టీ గేట్లు ఎత్తడం కాదు.. వీలైతే ముఖ్యమంత్రి ప్రాజెక్టుల గేట్లు ఎత్తాలన్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాజెక్టుల్లో నీళ్లున్నా.. నగరంలో నీటి ఎద్దడి ఏర్పడడానికి ఎవరు బాధ్యత వహిస్తారు? అని ప్రశ్నించారు.

Read also: JEE Main: రేపటి నుంచి జేఈఈ మెయిన్‌ -2 పరీక్షలు..

మహిళలు ఖాళీ కుండలతో పోరాడుతున్నారు. ప్రజలు మంచి నీరు మహాప్రభో అంటూ నినాదాలు చేస్తున్నారు. మరోవైపు రేవంత్ తిట్టిపోస్తున్నారు. నవంబర్ 2023లోనే మేము స్పష్టం చేసాము. కేసీఆర్ అంటే నీళ్లు. కాంగ్రెస్ వస్తే కన్నీళ్లే. కాళేశ్వరాన్ని విఫలమైన ప్రాజెక్టుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 218 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ వివరాలన్నీ రేవంత్ రెడ్డికి పంపనున్నారు. హైదరాబాదీలు కాంగ్రెస్‌కు ఓటేయరు. అందరికి తెలిసిందే.. అందుకే రేవంత్ హైదరాబాద్ ప్రజల పక్షం వహించాడా?. వాటర్‌ ట్యాంకర్‌ పంపడాన్ని మెచ్చుకోవద్దు అన్నారు. ఒక ముఖ్యమంత్రి మాట్లాడాల్సిన మాటలివి అని మండిపడ్డారు.

Read also: Shashi Tharoor: ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయం ఎవరంటే..?

సీఎం సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. బుక్ చేసిన వారానికి వాటర్ ట్యాంకర్లు వస్తున్నాయి. మీకు నిజాయితీ ఉంటే వాటర్ ట్యాంకర్లను ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఫోన్ ట్యాపింగ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదు. కొందరు హీరోయిన్లను బెదిరిస్తున్నారని ఓ మంత్రి మాట్లాడుతున్నారు. ఇక, ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎలాంటి సంబంధం లేదు. అలాగని ఆరోపణలు చేస్తే మేం ఎవరినీ విడిచిపెట్టబోము. నేను ఎవరికీ భయపడనని హెచ్చరించారు.
Aparna Das: ఆ హీరోను పెళ్లిచేసుకోబోతున్న త‌మిళ హీరోయిన్.. పెళ్లి ఎప్పుడంటే..?!

Exit mobile version