తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ నటించిన బెస్ట్ మూవీతో కాలీవుడ్ లోకి సినీ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ అపర్ణ దాస్. ఈ సినిమాలో రాజకీయ నాయకుడు కూతురుగా నటించి మెప్పించింది. ఇకపోతే గత సంవత్సరం తమిళంలో విడుదలైన ‘దాదా’ సినిమతో బిగ్గెస్ట్ కమర్షియల్ సాధించింది అపర్ణ దాస్. ఇకపోతే కొద్ది రోజుల్లో ఈవిడ పెళ్లి పీటలు ఎక్కుతోంది. ఇక ఈమెను చేసుకోబోయే వ్యక్తి గురించి చూస్తే..
Also read: Chhattisgarh : కూల్ డ్రింక్ లో మత్తు మందిచ్చి.. ముగ్గురు బాలికలపై అత్యాచారం
మంజుమ్మెల్ బాయ్స్ హీరోల్లో ఒకరిగా నటించిన దీపక్ పరంబోల్‌ను అపర్ణదాస్ పెళ్లాడనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ‘మంజుమ్మెల్ బాయ్స్’ సినిమాలో సుధి పాత్రలో దీపక్ నటించారు. దీపక్, అపర్ణదాస్ లు గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్నట్లు సమాచారం. ఇకపోతే వీరిద్దరూ పెద్దల అంగీకారంతో త్వరలో ఏడడుగులు వేయబోతున్నట్లు సమాచారం అందుతోంది. కేరళలోని వడక్కచేరిలో ఏప్రిల్ 24న అపర్ణదాస్, దీపక్ పెళ్లి జరుగనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
Also read: Harirama Jogaiah: టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధినాయకులకో విజ్ఞప్తి అంటూ.. హరిరామ జోగయ్య లేఖ!
ఇకపోతే తెలుగులోనూ అపర్ణదాస్ ఓ సినిమా చేసింది. మెగా హీరో వైష్ణవ్‌తేజ్ హీరోగా ఆదికేశవ సినిమాలో ఈవిడ ఇంపార్టెంట్ రోల్ చేసింది. ఈ సినిమాతోనే అపర్ణదాస్ టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే బాక్సాఫీస్ వద్ద చాలా డిజాస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఆపర్ణదాస్ కు కాస్త నిరాశను మిగిల్చింది. మలయాళంలో ‘మనోహరం’ సినిమాతో హీరోయిన్ గా తనదైన మార్క్ నటనతో విమర్శకుల ప్రశంసలను అందుకున్నది ఈవిడ. ఆ తర్వాత మలయాళంలో ప్రియన్ ఒట్టత్తిల్లాను, సీక్రెట్ హోమ్ ఇలా మరికొన్ని సినిమాలు చేసింది.