Minister KTR: మీడియా ‘మోడీయా’గా మారింది.. ఎప్పుడూ ఆ వార్తలేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
KTR Says Indian Media Turned As Modia: మన దేశంలోని మీడియా ‘మోడీయా’గా మారిపోయిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్లుగా మన్‌కీ బాత్ తప్ప.. ఆయన మీడియాతో మాట్లాడిన సందర్భం ఒక్కటి కూడా లేదన్నారు. ‘‘అమెరికా అధ్యక్షుడు జో బైడన్ హెలికాప్టర్ క్యాబిన్ ఇక్కడ తయారవుతోంది, ఐటీలో మంచి కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయి.. ఇలాంటి వార్తలు రాయండి, ఇవి వార్తలు కావా?’’ అని కేటీఆర్ ప్రశ్నించారు. మన విషయం మనం చెప్పుకుంటే తప్పేంటని నిలదీసిన ఆయన.. ఒకవేళ తాము తప్పు చేస్తే చీల్చి చెండాడండని అన్నారు. ఎప్పుడూ ఐటీ, ఈడీ దాడుల వార్తలేనా? మంచి చేసినప్పుడు ఎందుకు చూపించడం లేదు? అనితర సాధ్యమైన ఇంజనీరింగ్ ఫీట్ చేస్తే, ఎందుకు చూపించడం లేదు? అని కేటీఆర్ మండిపడ్డారు.
మిషన్ భగీరథ వల్ల చెరువు కట్టలు తెగడం లేదన్న కేటీఆర్.. ఇది వార్త కాదా? అని మీడియాని నిలదీశారు. కానీ.. కట్టలు తెగితే మాత్రం వెంటనే వార్తలు రాసేస్తారని అసంతృప్తి వ్యక్తం చేశారు. పాలు, చేపల ఉత్పత్తిలో తెలంగాణ ముందంజలో ఉందని.. ఇవన్నీ వార్తలు కావా? అని అడిగారు. అన్ని రంగాల్లో ఉన్న పాజిటివ్ వార్తలను ఎందుకు చూపించడం లేదన్నారు. ఏదైతే సెంటర్ పాయింట్ అవ్వాలో.. ఆ వార్తలు వేయడం లేదని ఆవేదన చెందారు. దేశ ఆర్థిక వ్యవస్థ విచ్ఛిన్నం అవుతున్నా, ద్రవ్యోల్బణం పడిపోతున్నా, నిరుద్యోగం పెరుగుతున్నా.. వాటిపై వార్తలు రావని చెప్పారు. కానీ.. ఏం తినాలి, ఏం వేసుకోవాలి అనేవి మాత్రం వార్తలొస్తాయన్నారు. ‘‘అయితే జుమ్లా మాటలు, లేకపోతే హమ్లా?’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సిటీలో వర్షం వచ్చినప్పుడు వార్తలు చూస్తే.. మొత్తం మునిగినట్టు అనిపిస్తుందన్నారు. ఈరోజుల్లో వార్తలు చూస్తే.. ఏది వార్తో, ఏది వాస్తవమో అర్థం కావడం లేదన్నారు. తాను పాత్రికేయుల్ని అనడం లేదని, మునుపటిలాగా వార్తల్లో నైతిక బలం లేదని పేర్కొన్నారు.
Also Read
తనకు తండ్రి నేర్పిన అలవాట్లలో పేపర్ చదవడం ఒకటని, రోజుకి తాను 13 పేపర్లు చదువుతానని కేటీఆర్ తెలిపారు. మీడియా కంటే, మీడియాలో పని చేసే కలం వీరుల పనితనం గొప్పదని కొనియాడారు. నిజాం కాలంలో షోయబ్ ఉల్లాఖన్, గోల్కొండ పత్రిక నడిపిన సురవరం ప్రతాపరెడ్డి లాంటి కలం వీరుల్లో నైతిక బలం ఉందన్నారు. కెసిఆర్ పార్టీ పెట్టిన సమయంలో మీడియా యాజమాన్యం సపోర్ట్ లేదని, కానీ మీడియాలో ఉన్న జర్నలిస్టులే తమకు సపోర్ట్‌గా నిలబడ్డారని అన్నారు. అప్పుడు మద్దతుగా నిలిచిన జర్నలిస్టులకు సముచిత స్థానం ఇచ్చి, గౌరవించుకున్నామన్నారు. దేశంలో ఎక్కడ లేని జర్నలిస్ట్ సంక్షేమాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తోందన్నారు. సంక్రాంతి తర్వాత మీడియా ఎకాడమీ బిల్డింగ్ ప్రారంభిస్తామని కేటీఆర్ చెప్పారు.
తాజావార్తలు
-
Nana Patekar: “రియల్ హీరో”.. సైనికులతో కలిసి కార్గిల్‌లో 60 రోజులు యుద్ధం చేసిన నానా పటేకర్..
-
Kieron Pollard: ముంబై ఇండియన్స్‌కు షాక్.. ప్రత్యర్థి జట్టులోకి కీరన్ పొలార్డ్!
-
Nara Lokesh: డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ కోసం సమిష్టిగా ముందుకు..
-
Royal Enfield Classic 350 ధర పెంపు.. కొత్త ధరలు ఇవే!
-
Starlink India Row: ‘మార్కెట్ గుత్తాధిపత్యం కోసమే అడ్డుకుంటున్నారు’.. Starlink Indiaపై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Free International Roaming: బంపర్ ఆఫర్.. 5GB డేటా, 60 నిమిషాల కాల్స్‌తో పాటు ఉచిత అంతర్జాతీయ రోమింగ్..!
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!