BRS KTR: బీఆర్‌ఎస్ పార్టీని ప్రజలే గుండెల్లో పెట్టుకుని కాపాడుతారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్‌ఎస్‌లో తాజా పరిణామాలపై ‘ఎక్స్’ వేదికపై కేటీఆర్ స్పందించారు. శూన్యం నుంచి సునామీ సృష్టించి అసాధ్యం అనుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అని ధీశాలి అని తెలిపారు. ఒంటరిగా వెళ్లి లక్షలాది మందితో సైన్యాన్ని తయారు చేసి ఎన్నో అవమానాలు, ద్రోహాలు, కుతంత్రాలు, కుతంత్రాలను అధిగమించే ధైర్యం కేసీఆర్ కు ఉందన్నారు. ఇలాంటి ధైర్యసాహసాలను కొందరు కప్పదాటులు, ద్రోహపూరిత ఎత్తుగడలతో కొట్టాలని చూస్తున్న రాజకీయ నాయకులకు తెలంగాణ ప్రజలే సమాధానం చెబుతారని అన్నారు. ప్రజల ఆశీర్వాదం, ఆదరణతో 14 ఏళ్లుగా పోరాడి ఉద్యమ పార్టీగా తెలంగాణను సాధించుకున్న కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీలను ప్రజలు గుండెల్లో పెట్టుకుని తెలంగాణ దశ, దిశను కాపాడుతారన్నారు. కొత్త తరం నాయకత్వాన్ని సిద్ధం చేస్తామని కేటీఆర్ అన్నారు.
Read also: PM Modi-Bill Gates: డిజిటల్ రంగంతో భారత్లో చాలా మార్పులు వచ్చాయి..
మరోవైపు హన్మకొండలో మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదైంది. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేతలు హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను మభ్యపెడుతున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులో పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదుతో కేటీఆర్‌పై హన్మకొండ పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. మరి ఈకేసుపై కేటీఆర్ స్పందించక పోవడం గమనార్హం.
Gold Price Today : పరుగులు పెడుతున్న పసిడి.. అదే దారిలో వెండి ధరలు..