రాజన్న సిరిసిల్ల జిల్లా… పోడు భూముల పై అవగాహన సమావేశంలో మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు రమేష్ బాబు,రసమయి బాల కిషన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అడ వుల ను ఆక్రమించకుండా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సిరి సిల్ల అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందన్నారు. జిల్లాలో 4 లక్ష72 వేల 329 ఎకరాలు భూమి ఉందన్నారు. దీన్లో 96.394 ఎకరాల అటవీ ప్రాంతం ఉంది. 2005-06 కేంద్రం ఆర్ ఓ.ఎఫ్ ఆర్ చట్టాన్ని తీసుకు వచ్చిందన్నారు. 8 వేల ఎకరాల్లో ఫారెస్ట్ ఏరియాను ఆక్రమించుకు న్నారన్నారు. 67 గ్రామాల పరిధిలో సదస్సులు నిర్వహించి సమస్య పరిష్కరించాలని చూస్తున్నట్టు మంత్రి తెలిపారు. దీనిపై నవంబర్ 8 నుంచి గ్రామాల వారిగా సదస్సులు నిర్వహిస్తామన్నారు.
దరఖాస్తు పెట్టుకున్న పోడు రైతుల దరఖాస్తులను పరిశీలిస్తామని మంత్రి వెల్లడించారు. భవిష్యత్‌లో సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నామన్నారు.భూములు కేటాయిం చిన వారితో ప్రతిజ్ఞ తీసుకుంటాం. భవిష్యత్‌లో అటవీ భూములు ఆక్రమణకు గురి కాకుండా ఫారెస్ట్ రైట్స్ కమిటీ ఏర్పాటు చేయను న్నట్టు మంత్రి పేర్కొన్నారు. జిల్లా స్థాయిలో ఫారెస్ట్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అటవీ భూమిని సంరక్షణ చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ప్రభుత్వానికి మరో ఎజెండా ఏమీ లేదని స్పష్టం చేశారు. ముస్తాబాద్ మండలం ఛీకొడు, చిప్పల పల్లి గ్రామాల మధ్య దుర్గరెడ్డి అనే వ్యక్తి 70 ఎకరాలు ఫారెస్ట్ భూమి అక్రమించాడని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్లిన సర్పంచ్ భర్త. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్ వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
