BRS KTR: లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేటి నుంచి జీహెచ్‌ఎంసీలో రోడ్‌షోలు నిర్వహించనున్నారు. మే 2వ తేదీ నుంచి 7వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ రోడ్‌షోలో భాగంగా సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రచారం నిర్వహించనున్నారు. మొదటి రోజు జూబ్లీహిల్స్, కూకట్‌పల్లి, 3న సికింద్రాబాద్, సనత్‌నగర్, నాంపల్లి, 4న కుత్బుల్లాపూర్, మేడ్చల్, కంటోన్మెంట్, మల్కాజిగిరి, 5న ఎల్‌బీనగర్, ఉప్పల్, ముషీరాబాద్, 6న శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, 7న ఖైరతాబాద్, అంబర్‌పేటలో కేటీఆర్ రోడ్ షోలు ఉంటాయి.
Read also: Rajasthan : పెళ్లి ఇంట్లో విషాదం.. ఏసీ పేలి తాత సజీవదహనం
మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ నిషేధం విధించిన విషయం తెలిసిందే.. దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. దీనిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ.. తెలంగాణ గొంతుక అయిన కేసీఆర్ గొంతుపైనే నిషేదమా? అని ప్రశ్నించారు. మోడీ విద్వేషాలు ఈసీకి వినిపించలేదా? రేవంత్ బూతులు ఈసీకి ప్రకవచనాల్లాగా అనిపించాయా అనిప్రశ్నించారు. ఇది బడేభాయ్,చోటే భాయ్ కలిసి చేసిన కుట్ర కాదా అని అన్నారు. కేసీఆర్ బస్సు యాత్ర చూసి బీజేపీ,కాంగ్రెస్ బయపడుతున్నాయని విమర్శించారు. వాళ్ల అహంకారానికి తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు.
Harihara Veeramallu:వాడొచ్చి దొంగ దొరల లెక్కలు సరి చేస్తాడు.. గూస్ బంప్స్ గ్యారెంటీ టీజర్..