Site icon NTV Telugu

KTR Respond Twiiter Request: ట్విట్ చేసిన యువ‌కుడు.. స్పందించి కేటీఆర్‌.. ఏముంది?

Ktr Tweet

Ktr Tweet

తెలంగాణ మంత్రి కేటీఆర్ సోష‌ల్ మీడియాలో అల‌ర్ట్ గా వుంటారు. ప్ర‌తి విష‌యాన్ని షేర్ చేసి అంద‌రితో పంచుకుంటుంటారు. ట్విట్ ద్వారా ఏవైన స‌మ‌స్య‌ల గురించి చెప్పినా వెంట‌నే స్పందిస్తారు కేటీఆర్. అయితే ఇటువంటి ఘ‌ట‌నే ట్వీట‌ర్ వేదిక‌గా స్పందించారు కేటీఆర్. హైదరాబాద్​లోని స్వర్ణపురి కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి కేటీఆర్​కు ట్వీట్ చేశారు. వారందరూ నివసిస్తున్న ప్రాంతంలో విషజ్వరాలు ప్రబలుతున్నాయని, తక్షణమే స్పందించి వైద్య సేవలు అందించాలని కోరుతూ సుబ్రహ్మణ్యం కేటీఆర్​కు ట్విట్టర్​లో విన్నవించారు.

read also: Pooja Hegde :మహేష్ బాబుకే కండీషన్స్ పెట్టిందా..!

అయితే.. తమ కాలనీలో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక చిన్నపిల్లలు, పెద్దలు తరచూ అనారోగ్యం బారినపడుతున్నారని, ప్రస్తుతం కొందరు విష జ్వరాలతో బాధపడుతున్నట్టు ట్విట్టర్​లో పేర్కొన్నారు. దీంతో.. వెంటనే స్పందించిన మంత్రి కేటీఆర్, శేర్​లింగంపల్లి వైద్య సిబ్బందికి సమాచారం అందించారు. అంతేకాదు.. వారే స్వ‌యంగా శిల్పా లేఅవుట్​కు వెళ్లి అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులకు వైద్య సేవలు అందించి తగిన మందులను అందించారు కోరారు. వైద్య సిబ్బందికి మంత్రి కేటీఆర్ సమాచారం ఇవ్వడంతో వారు అక్కడకు వెళ్లి బాధితులకు వైద్యసేవలు అందించారు. ఆయువ‌కుడు చేసిన‌ ట్వీట్​కి స్పందించి తక్షణమే వైద్య సేవలు అందేలా చూసిన మంత్రి కేటీఆర్​కు వారు కృతజ్ఞతలు తెలిపారు.

PM Modi: షింజోపై దాడిని ఖండించిన భారత్.. మనోవేదనకు గురయ్యానని మోదీ ట్వీట్..

Exit mobile version