Site icon NTV Telugu

Minister KTR: ఆ సమస్యను పరిష్కరించండి.. మంత్రి సబితకు కేటీఆర్‌ సూచన

Ktr Sabitha Indrareddy

Ktr Sabitha Indrareddy

Minister KTR: నిజాం కాలేజీ అండర్ గ్రాడ్యుయేట్ విద్యార్థుల హాస్టల్ కేటాయింపు సమస్యపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పందించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల పక్షాన నిలబడి ఈ విషయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోక్యం చేసుకుని తక్షణమే సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. తన మాట ప్రకారం హాస్టల్ నిర్మించి కాలేజీకి ఇచ్చినా ఈ వివాదం అనవసరమన్నారు కేటీఆర్. వెంటనే సమస్యకు ముగింపు పలకాలని నిజాం కళాశాల ప్రిన్సిపాల్‌కు సూచించారు.

నూతనంగా నిర్మిస్తున్న మహిళా హాస్టల్‌లో విద్యార్థినులకు వసతి కల్పించాలని కోరుతూ నిజాం కళాశాల విద్యార్థులు గత కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్నవిషయం తెలిసిందే.. నిన్న (సోమవారం) కళాశాల ఎదుట విద్యార్థులు మౌనదీక్ష చేపట్టారు. మార్చిలో హాస్టల్‌ను ప్రారంభించామని, నేటికీ యూజీ విద్యార్థులను హాస్టల్‌లో ఉంచేందుకు కళాశాల యాజమాన్యం ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని నిలదీశారు. కళాశాల హాస్టళ్లలో వసతి అవసరమైన సుమారు 500 మంది విద్యార్థులు ప్రైవేట్ హాస్టళ్లలో భారీగా డబ్బులు చెల్లించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్‌లో వసతి కల్పించాలని కళాశాల అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్న విద్యార్థులు చెబుతున్నారు. యూజీ విద్యార్థులకు హాస్టల్‌లో ఎందుకు వసతి కల్పించలేదో తెలియడం లేదన్నారు. నిజాం కాలేజీలో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది. యూజీ విద్యార్థులకు హాస్టళ్లు కేటాయించాలంటూ కాలేజీలో శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు. నూతనంగా నిర్మించిన హాస్టల్ భవనాన్ని యూజీ విద్యార్థులకు కాకుండా పీజీ విద్యార్థులకు ఇవ్వాలని కొద్ది రోజులుగా నిజాం కాలేజ్ లో విద్యార్థుల ఆందోళన కొనసాగుతోంది.
African Swine Fever: ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫీవర్‌ కలకలం.. ఒక్కరోజే 85 పందులు మృతి

Exit mobile version