NTV Telugu Site icon

KTR: కామారెడ్డి ఇష్యూ పై స్పందించిన కేటీఆర్.. అభ్యంతరాలు వుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి

Ktr

Ktr

KTR responded on Kamareddy issue: కామారెడ్డి ఇష్యూ పై మంత్రి కేటీఆర్ స్పందించారు. అభ్యంతరాలు వుంటే ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని తెలిపారు. MCHRD లో జరుగుతున్న పట్టణ ప్రగతి వర్క్ షాప్ కు మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం కేటీఆర్‌ కామారెడ్డి ఇష్యూ పై మాట్లాడుతూ.. ఆ సమస్య ఎందుకు వచ్చిందని కేటీఆర్ మున్సిపల్ కమిషనర్ ను అడిగి తెలుసుకున్నారు. మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ స్టేజ్ లో ఉందని ఎందుకు ప్రజలకు చెప్పలేకపోయారు? అని ప్రశ్నించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మార్పులు చేర్పులు చేస్తామని చెప్పవచ్చు కదా? అని అన్నారు. కామారెడ్డిలో ఇండస్ట్రియల్ జోన్ లో పడిందని కొందరు ఆందోళన చేస్తున్నారని అన్నారు. ఈ ప్రభుత్వం ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి లేదని.. ప్రజలకు సాయం చేయడానికి ఉన్నామన్నారు మంత్రి కేటీఆర్‌. నగరాల అభివృద్ధి కోసమే మాస్టర్ ప్లాన్ ఏర్పాటు అన్నారు.

Read also: Hardik Pandya: రోహిత్ రికార్డ్ బ్రేక్ చేసిన హార్దిక్.. భారత క్రికెట్ చరిత్రలో తొలి కెప్టెన్

మాస్టర్ ప్లాన్స్ పై ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకురండని మంత్రి కేటీఆర్‌. ప్రజా ప్రతినిధులు, ప్రజలు అభ్యంతరాలు ఇస్తే సమగ్రంగా సమీక్షించండన్నారు. 12 అవార్డుల నుంచి గత ఏడాది 26 అవార్డులు తెలంగాణ ప్రభుత్వం కు కేంద్ర ప్రభుత్వం నుంచి స్వచ్ఛ సర్వేక్షన్ కేటగిరీలో వచ్చాయన్నారు. ప్రజా ప్రతినిధుల కంటే ప్రభుత్వ యంత్రాంగం కష్టపడిందని అన్నారు. పని చేయడం వల్లే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రంకు అవార్డులు వస్తున్నాయన్నారు. రాజకీయంగా చూస్తున్నారని, కేంద్ర ప్రభుత్వంతో మనకు గొప్ప ఫ్రెండ్ షిప్ లేదన్నారు. అయిన తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధినీ కేంద్రం ఇగ్నోర్ చేయలేని పరిస్థితి వచ్చిందన్నారు.

Show comments