KTR Delhi Tour: మంత్రి కేటీఆర్ రెండు రోజు ఢిల్లీ పర్యటన కొనసాగతుంది. ఇవాళ మధ్యాహ్నం కేంద్రమంత్రి హరిదీప్ సింగ్ పూరితో కేటీఆర్ సమావేశం కానున్నారు. మెట్రో రెండో దశ పనులకు కేంద్ర సాయం కొరనున్నారు. ఇక అమిత్ షా అపాయింట్మంట్ కోసం కేటీఆర్ వేచివున్నారు. అయితే అమిత్ షా అపాయింట్మెంట్ ఇప్పటి వరకు ఇంకా ఖరారు కాకపోవడ గమనార్హం. నేటితో మంత్రి కేటీఆర్ ఢిల్లీ రెండురోజుల పర్యటన ముగియనుంది. అయితే ఈ నేపథ్యంలో.. ఇవాల షాతో కూడా కలిసేందుకు అపాయింట్మెంట్ మంత్రి కోరగా ఇంకా ఇప్పటి వవరకు అపాయింట్మెంట్ దొరక్కపోవడం కీలకంగా మారింది. ఒక వేళ షాతో కేటీఆర్ అపాయింట్మెంట్ కుదరకపోతే మరి రేపు కూడా మంత్రి అక్కడే వుండి షా తో మీట్ అయి వస్తారా? లేక ఇవాలే హైదరాబాద్ కు రానున్నారా? అనే విషయం పై సన్నద్ధత నెలకొంది.
నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కేటిఆర్ కలిసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ లో స్కైవేల నిర్మాణానికి డిఫెన్స్ లాండ్స్ ఇవ్వాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, కేంద్రం సహాయ సహకారాలు అందించాలని పలు సందర్భాల్లో విన్నవించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. కేంద్రం నుంచి ఇప్పటివరకు అందిన సాయం శూన్యమని విమర్శించారు. హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతున్న నగరమన్నారు. వ్యాక్సిన్ తయారీకి తెలంగాణ గ్లోబల్ హబ్‌గా మారిందని అన్నారు. హైదరాబాద్ వరదలకు కేంద్రం సాయం చేయలేదన్నారు. హైదరాబాద్‌లో రక్షణ శాఖ భూములు ఉన్నచోట అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతుందన్నారు. ఈ విషయమై ఇప్పటివరకు ఎన్డీయే ప్రభుత్వంలో పనిచేసిన ఐదుగురు రక్షణ మంత్రులను పలుమార్లు కలిశామన్నారు. రాజ్‌సింగ్‌ను మరోసారి కలిశామని తమ డిమాండ్లను వినిపించామని చెప్పారు. ప్రధానంగా నాలుగు వినతులు ఇచ్చినట్లు తెలిపారు. ఇవాల వాటిని పరిశీలించాల్సిందిగా కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కోరనున్నట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి రాజీవ్ రహదారి వెళ్లే దారిలో స్కై వెలా నిర్మాణానికి 96 ఎకరాల రక్షణ శాఖ భూమిని కోరాం. దానికి సమానంగా భూమి ఇస్తామని చెప్పారు.
అలాగే.. మా వద్ద పట్టి నుంచి నాగ్‌పూర్ హైవే వరకు 18.5 కి.మీ మే స్కైవే నిర్మించేందుకు 56 ఎకరాల స్థలం అడిగారు.భూమి ఇస్తామని చెప్పారు. ఉప్పల్‌లో స్కై వాక్ నిర్మించాం సోమవారం ప్రారంభిస్తాం. మనం కోరుకుంటున్నాం. మొహిదీపట్నం రైతుబజార్ వద్ద కూడా అలాంటి స్కై వాక్ నిర్మించాలని.. రక్షణ శాఖ స్థలం కూడా ఉందని.. అందులో అర ఎకరం కావాలని కోరారు. హైదరాబాద్ నగరంలో 142 లింక్ రోడ్లు ప్లాన్ చేశాం.. రెండు, మూడు కారిడార్లలో రక్షణ శాఖకు చెందిన భూములు అడ్డు వస్తున్నాయని.. వాటిని కూడా ఇవ్వాలని కోరారు. అలాగే కంటోన్మెంట్ ఏరియాలోని లీజు భూములను జీహెచ్ ఎంసీకి బదలాయిస్తే ప్రజలకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టేందుకు దోహదపడుతుందన్నారు. సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నాం’’ అని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం స్పందించి సహాయం అందిస్తే సంతోషిస్తామన్నారు. లేకుంటే ప్రజా క్షేత్రంలో తమ తీరును ఎండగడతామన్నారు. మెట్రో రైలు ప్రాజెక్టు విస్తరణకు కేంద్రానికి ప్రతిపాదనలు కూడా ఇచ్చామన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని 10 మెట్రోలకు సాయం అందించిన కేంద్రం తెలంగాణలో హైదరాబాద్‌కు సాయం అందించడం లేదని విమర్శించారు. గుజరాత్‌లో వరదలు వస్తే ఆదుకుంటామని, హైదరాబాద్‌కు ఇంతవరకు సాయం చేయలేదని విమర్శించారు.
BC Degree Gurukulalu: కొత్తగా 17 బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలు.. అదనంగా 16,320 సీట్లు అందుబాటులోకి