Site icon NTV Telugu

జాతీయ పట్టణ ఉపాధిహామీని ప్రవేశపెట్టాలి: మంత్రి కేటీఆర్‌

జాతీయ పట్టణ ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని మంత్రి కేటీఆర్‌ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశంలో పట్టణీకీకరణ భారీ ఎత్తున పెరుగుతుందని, ఫలితంగా పట్టణ పేదరికం కూడా పెరిగే అవకాశం ఉందని మంత్రి అన్నారు. పట్టణాలకు వచ్చే పేద ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు కోసం వారి ఆదాయ మార్గాలు పెంచాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉందన్నారు. పట్టణ పేద ప్రజలు కనీస అవసరాలను అందుకునేలా వారి ఉపాధి హామీ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుందని మంత్రి అభిప్రాయపడ్డారు.

Read Also: దాడులు చేసే సంస్కృతికి బీజేపీ వ్యతిరేకం: బండి సంజయ్‌

గ్రామీణ ఉపాధి హామీ పథకం మాదిరే పట్టణల్లోనూ ప్రత్యేక ఉపాధి హామీ పథకాన్ని కేంద్రం ప్రారంభించాలని కోరారు. పార్లమెంటరీ స్థాయి సంఘం తో పాటు సీఐఐ వంటి సంస్థలు ఇచ్చిన సిఫార్సులను ఈ సందర్భంగా మంత్రి ఉదాహరించారు. ఇప్పటికే 30 శాతం కి పైగా దేశ ప్రజలు పట్టణాల్లో నివాసం ఉంటున్నారని భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు.
పట్టణ పేదల కోసం ఈ బడ్జెట్లో ఈ ప్రత్యేక ఉపాధి హామీ కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టాలని కేంద్రాన్ని కేటీఆర్‌ కోరారు. పట్టణీకరణ, పట్టణ పేదరికం, పట్టణ పేదల జీవితాల్లో సానుకూల మార్పులకు తీసుకోవాల్సిన చర్యల వంటి అంశాల పైన కేటీఆర్ కీలక సూచనలు చేశారు.

Exit mobile version