Site icon NTV Telugu

80 కుటుంబాలకు టీఆర్ఎస్‌ అండా.. చెక్కులు అందచేసిన కేటీఆర్

ktr

ktr

పార్టీ శ్రేణుల సంక్షేమం కోసం.. పార్టీ సభ్యులకు ఇన్సూరెన్స్‌ తీసుకొచ్చింది టీఆర్ఎస్‌.. పార్టీ సభ్యత్వం ఉన్నవారు ఎవరైనా మృతిచెందితే వారికి ఇన్సూరెన్స్‌ అందిస్తూ వస్తున్నారు.. వివిధ కారణలతో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబ సభ్యులకు ఇవాళ తెలంగాణ భవన్‌లో ఇన్సూరెన్స్ చెక్కులు అందించారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. 80 మందికి రెండు లక్షల రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ చెక్కులు అందజేశారు.. ఈ సంవత్సరం పార్టీ మొత్తం కార్యకర్తలకు 18 కోట్ల రూపాయల ప్రీమియం డబ్బులను ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులకు అందించారు కేటీఆర్.. ఈ కార్యక్రమంలో పార్టీ జనరల్ సెక్రటరీలు, ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ… పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం 18 కోట్లు ఇన్సూరెన్స్ డబ్బులు కడుతూ వస్తున్నామని.. ఇప్పటి వరకు 950 మంది పార్టీ సభ్యులు చనిపోయారని.. వారి కుటుంబాలకు మేం అండగా ఉంటామని.. సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.

Exit mobile version