NTV Telugu Site icon

KTR: గల్లిమే లూటో… ఢిల్లీకి భేజో అన్నట్టుగా కాంగ్రెస్ నేతల తీరు

Ktr

Ktr

KTR: గల్లిమే లుటో…డిల్లీకి బేజో అన్నట్టుగా కాంగ్రెస్ నేతల తీరు ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సివిల్ సప్లైస్ శాఖలో కుంభ కోణం పై ఒక్కరూ మాట్లాడడం లేదన్నారు. కాంగ్రెస్ అంటేనే స్కాం లు అని చెప్పామన్నారు. గల్లిమే లుటో…డిల్లీకి బేజో అన్నట్టుగా కాంగ్రెస్ నేతల తీరు ఉందన్నారు. కుంభకోణాలకు తెర లేపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నారు. వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం సివిల్ సప్లైస్ శాఖలో జరిగిందన్నారు. ఈ కుంభకోణంలో తెలంగాణ లోని కాంగ్రెస్ పార్టీ నేతలు కాకుండా డీల్లి పెద్దల హస్తం ఉందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదన్నారు.
కాంగ్రెస్ నేతలు తమ జేబులు నింపుకోవడం లేదు.. ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు లో 700 నుంచి 750 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందన్నారు. ధాన్యం సేకరణ కోసం జనవరి 25 న కమిటీ , గైడ్ లైన్స్ ,టెండర్లు పిలిచింది ఈ ప్రభుత్వం అని తెలిపారు.

Read also: Remal Cyclone : రెమల్ తుఫానుకు ఆ పేరు ఎందుకు పెట్టారు..ఇంతకీ దాని అర్థం ఏమిటంటే ?

నాలుగు కంపెనీలకు టెండర్లు వచ్చేలా చూశారన్నారు. కేంద్రీయ బండార్ తో పాటు మూడు సంస్థలకు టెండర్లు వచ్చేలా చూశారన్నారు. గతంలో కేంద్రీయ బండర్ ను మేము అధికారంలో ఉన్నప్పుడు బ్లాక్ లిస్ట్ లో పెట్టామన్నారు. నాలుగు సంస్థలు రైస్ మిల్లర్లను భయపెట్టి మనీ లాండరింగ్ కు పాల్పడుతున్నాయని మండిపడ్డారు. రాష్ట్రంలోని రైస్ మిల్లులను ఈ నాలుగు కంపెనీలు భయపెడుతున్నాయన్నారు. పిల్లల మధ్యాహ్న బోజన పథకం లో సన్న బియ్యం సేకరణ వ్యవహారంలో 300 కోట్లు స్కాం చేశారన్నారు. 35 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణ లో నాలుగు కంపెనీలు 700 కోట్ల రూపాయలు మిలర్ల నుంచి వసూలు చేశాయన్నారు. సంబంధం లేని ప్రైవేట్ సంస్థలు రైస్ మిల్లుల నుంచి డబ్బులు ఎలా వసూలు చేస్తాయి ? అన్నారు. నాలుగు కంపెనీలు ప్రభుత్వ ఏజెంట్ ల లాగా వ్యవహరిస్తున్నాయన్నారు. గడువు ముగిసిన 20 శాతం ధ్యానంను ఈ నాలుగు కంపెనీలు లిఫ్ట్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read also: Fire Accident: 4 అంతస్తుల నివాస భవనంలో చెలరేగిన మంటలు.. ముగ్గురు మరణం..

తొంభై రోజుల్లో ఎంత ధాన్యం సేకరించారు శ్వేత పత్రం విడుదల చేయాలి రాష్ట్ర ప్రభుత్వం అని డిమాండ్ చేశారు. పిల్లల మధ్యాహ్న బోజన పథకం లో సన్న బియ్యం తో భోజనం స్కీమ్ ను కెసిఅర్ తీసుకువచ్చారన్నారు. ఈ స్కీమ్ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కు 2 లక్షల 20 వేల మెట్రిక్ టన్నులు బియ్యం కావాలన్నారు. మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లు పిలిచారు…మళ్ళీ ఆ నాలుగు కంపెనీలు టెండర్ల లో పాల్గొన్నాయన్నారు. బయట మర్కెట్ కంటే పన్నెండు రూపాయలు అదనంగా పెట్టి సివిల్ సప్లైస్ శాఖ సన్న బియ్యం కొనుగోలు చేసిందన్నారు. ఆ నాలుగు కంపెనీల తో కిలో సన్న బియ్యం ను 57 రూపాయలు,56.90 రూపాయలకు కొనుగోలు ఒప్పందం చేసుకుంది సివిల్ సప్లైస్ శాఖ అని తెలిపారు. కాంట్రాక్టు సంస్థలతో కుమ్మక్కై 11 వందల కోట్ల రూపాయల కుంభకోణం రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చేశారన్నారు.

Read also: Heat Waves: జర ఫైలం.. మధ్యాహ్నం తర్వాత బయటకు రావొద్దు.. ఎందుకో తెలుసా..?

రేవంత్ రెడ్డి పాత్ర ఈ కుంభకోణం లో పాత్ర ఉన్నది…ఇందులో అనుమానం లేదన్నారు. ఈ వ్యవహారంలో బిజెపి పాత్ర విడ్డూరంగా ఉందన్నారు. అనుమానాస్పదంగా ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. FCI అంతా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉందన్నారు. బిజెపి LP నేత మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నారు…కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చేయడం లేదన్నారు. తొంభై రోజుల్లో ధ్యానం సేకరణ చేయని నాలుగు కంపెనీలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలన్నారు. బ్లాక్ లిస్ట్ చేసిన కేంద్రియా బండార్ కంపెనీకి ఎందుకు మినహాయింపు ఇచ్చారో చెప్పాలన్నారు. FCI ఎందుకు స్పందించడం లేదు…ఈడి , సీబిఐ కి FCI పిర్యాదు చేయాలన్నారు. రేవంత్ రెడ్డి కి చిత్తశుద్ది ఉంటే సిట్టింగ్ జడ్జితో విచారణ వెయ్యాలన్నారు.. మీ మంత్రి ఉత్తమ్ స్వాతి ముత్యం అయితే.. సివిల్ సప్లైస్ శాఖలో కుంభకోణం పై ఆధారాలతో BRS న్యాయ పోరాటం చేస్తుంది…కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇస్తామన్నారు.
Gold Rate: మహిళలు గుడ్ న్యూస్.. బంగారం ధర ఢమాల్.. వారం రోజుల్లో ఏకంగా..