Site icon NTV Telugu

KTR : పార్టీ మారిన ఎమ్మెల్యేల సిగ్గు లేదు

Ktr

Ktr

బస్తీ దవాఖానను మంగళవారం సందర్శించిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో దానం నాగేందర్ పేరును చేర్చిన అంశాన్ని తీవ్రంగా విమర్శించారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. “దానం నాగేందర్ బీఆర్‌ఎస్‌లో ఉన్నారని ఎవరు చెప్పారు? ఏ పార్టీకి చెందుతారో చెప్పే ధైర్యం లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నారు? పార్టీ మారిన ఎమ్మెల్యేలకు సిగ్గు లేదు. స్పీకర్ వద్ద అబద్దాలు చెబుతూ, పార్టీ మారలేదని ప్రజలను మోసం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా నీతి ఉందా?” అని ప్రశ్నించారు.

కేటీఆర్ ప్రజారోగ్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని కూడా విమర్శించారు. “విజయోత్సవాలకెక్కడానికి ముందు, ప్రజల ప్రాణాలను కాపాడటం ముఖ్యమంత్రి పని. మున్సిపల్ మంత్రి లేకపోవడంతో హైదరాబాద్ అనాధగా మారింది. నగరం చెత్తతో నిండిపోయింది” అని అన్నారు. సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ సిబ్బందికి జీతాలు పెంచకపోవడం తగదు అని కేటీఆర్ డిమాండ్ చేశారు.

“కాంగ్రెస్ ప్రభుత్వంలో బస్తీ దవాఖానల్లో సరైన వసతులు లేవు. అవసరమైన మందులు కూడా అందుబాటులో లేవు. టిమ్స్ ఆసుపత్రుల ముందు వెయ్యి మందితో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం” అని హెచ్చరించారు. కేసీఆర్ ఆలోచనతో కరోనా సమయంలో కూడా ప్రజలకు వైద్యం అందించడానికి ఏర్పాట్లు జరుగుతాయని గుర్తుచేశారు. పేదల కోసం 450 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు, ఉచిత వైద్య పరీక్షలు చేయడానికి టీ డయాగ్నొస్టిక్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

Allu Shireesh : శిరీష్ కు కాబోయే భార్య ఫొటో షేర్ చేసిన స్నేహారెడ్డి..

Exit mobile version