KTR : తెలంగాణ ప్రభుత్వం రోడ్ సేఫ్టీ సెస్ పేరుతో కొత్త వాహనాల కొనుగోలుదారులపై అదనపు భారం మోపడాన్ని భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఈ చర్య ముఖ్యమంత్రి యొక్క ప్రజావ్యతిరేక వైఖరికి నిదర్శనమని ఎక్స్ (గతంలో ట్విట్టర్) వేదికగా ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టు రహదారి ప్రమాదాల నివారణకు భద్రతా చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తే, వాటిని అమలు చేయకుండా ప్రజలపై భారం మోపడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని కేటీఆర్ అన్నారు. రాష్ట్ర బడ్జెట్ నుంచి నిధులు కేటాయించి రహదారి భద్రత ప్రమాణాలను పెంచకుండా, అమాయక ప్రజలపై రూ.270 కోట్ల అదనపు భారం మోపాలని చూడటం అత్యంత దారుణమని ఆయన పేర్కొన్నారు.
KTR : రోడ్ సేఫ్టీ కాదు, కాంగ్రెస్ స్కామ్..కేటీఆర్ సంచలన ఆరోపణలు.!
హైడ్రా వంటి విధానాలతో ప్రభుత్వ ఆదాయాలకు గండికొట్టి, ఇప్పుడు ఆ లోటును పూడ్చుకోలేక సామాన్య ప్రజలపై విరుచుకుపడటం దుర్మార్గమైన చర్య అని కేటీఆర్ విమర్శించారు. రహదారి భద్రతా సెస్ పేరుతో ఒక్కో కొత్త వాహనంపై రూ.2 నుంచి రూ.10 వేల వరకు అదనపు భారం వేయడం పేద, మధ్యతరగతి ప్రజలను మోసం చేయడమేనని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా, ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమైందని కేటీఆర్ అన్నారు. ప్రజల నుంచి ముక్కుపిండి డబ్బులు వసూలు చేయాలని కుట్ర పన్నితే ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్షమించరని హెచ్చరించారు. కష్టపడి కూడబెట్టుకుని లేదా అప్పు చేసి వాహనం కొనుగోలు చేసే వారి జేబులు కొట్టే ఇలాంటి పన్నాగాలకు ఇకనైనా స్వస్తి పలకాలని కాంగ్రెస్ సర్కారును డిమాండ్ చేశారు.
Ranchi: హోటల్ గదిలో ISIS ఉగ్రవాదుల కోసం స్టూడెంట్ బాంబు తయారీ..
