Site icon NTV Telugu

KTR : పునర్విభజనలో తక్కువ సీట్లు కేటాయిస్తామని అనడం అన్యాయం కాదా?

Ktr

Ktr

KTR : జైపూర్‌లో జరుగుతున్న టాక్ జర్నలిజం 9వ ఎడిషన్ చర్చా కార్యక్రమంలో తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దేశ రాజకీయాలు, నియోజకవర్గ పునర్విభజన, భాషా విధానాలు వంటి పలు అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ మాట్లాడుతూ బీహార్ ఎన్నికల ఓటర్ల సవరణలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే దక్షిణాదికి జరుగుతున్న అన్యాయం, పార్లమెంటు సీట్ల కేటాయింపులోని అసమానతలపై విస్తృతంగా మాట్లాడారు.

కేటీఆర్ మాట్లాడుతూ, “బీహార్‌లో జరుగుతున్న ఎన్నికల ఓటర్ల సవరణ ఇది మొదటిసారి కాదు. కానీ ఈసారి మాత్రం తీవ్రమైన విమర్శలు వినిపిస్తున్నాయి. భారత ఎన్నికల కమిషన్ ఏం చేస్తుంది? ఇండియా లాంటి అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఒక్క వ్యక్తి ఓటు కోల్పోయినా దాని మీద చర్యలు తీసుకోవాలి,” అని అన్నారు.

JUNIOR : వైరల్ వయ్యారి కోసం కిరీటి ఎంత కష్టపడ్డాడో.. వీడియో వైరల్

కేరళ లాంటి రాష్ట్రాలు కుటుంబ నియంత్రణలో అద్భుతంగా ముందంజలో ఉన్నా నియోజకవర్గ పునర్విభజనలో తక్కువ సీట్లు ఇవ్వడం అన్యాయం అని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. “ఉత్తరప్రదేశ్‌లో కుటుంబ నియంత్రణ సరిగా అమలు చేయని రాష్ట్రాలకు పార్లమెంటు సీట్లు పెంచి దక్షిణాదికి తగ్గిస్తామని చెప్పడం సమాఖ్య వ్యవస్థకు మంచిది కాదు. ఈ అన్యాయంపై బీఆర్ఎస్, తెలంగాణ కాంగ్రెస్ కూడా ఒకే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి,” అని చెప్పారు.

దేశానికి ఒకే జాతీయ భాష అవసరం లేదని స్పష్టంచేశారు. “మందబలం, అధికారం ఉన్నాయన్న అహంకారంతో బలవంతంగా హిందీని రుద్దుతామంటే ఒప్పుకోలేం. ఇంగ్లీష్ భాష ప్రపంచవ్యాప్తంగా అవకాశాలకు మార్గం చూపుతోంది. కేవలం హిందీ నేర్చుకొని అమెరికా, ఇంగ్లాండ్ లాంటి దేశాలకు వెళ్ళి ఏమి సాధించగలం?” అని ప్రశ్నించారు.

Delay in Marriage: జాతకంలో ఈ దోషం ఉంటే పెళ్లి ఆలస్యం.. నివారణ మార్గాలు ఇవే..

Exit mobile version