NTV Telugu Site icon

KTR: కాంగ్రెస్ పార్టీకి ఒకటి కాదు పది ఛాన్సులు ఇచ్చాం.

Ktr

Ktr

రాహుల్ గాంధీ తెలంగాణకు వచ్చి ఒక ఛాన్స్ ఇవ్వాలని కోరుతున్నారని.. కాంగ్రెస్ పార్టీకి ఒకటి కాదు పది ఛాన్సులు ఇచ్చామని అయినా అభివృద్ధి జరగలేదని.. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని విమర్శించారు మంత్రి కేటీఆర్.  కోల్లాపూర్ లో జరిగిన సభలో ఆయన కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాలం చెల్లిన మందులాంటిది కాంగ్రెస్ అని.. ఎలా నమ్మాలని ప్రశ్నించారు. అనాలోచిత విధానాలతో దేశాన్ని రావణకాష్టంలా మార్చింది బీజేపీ అని, స్విస్ బ్యాంకుల నుంచి నల్లధనాన్ని తెస్తామని చెప్పారని.. మాట తప్పారని, కాంగ్రెస్, బీజేపీ మాయమాటలు నమ్మకండి. అభివృద్ధి కాముకులను ప్రోత్సాహించండి అని ప్రజలను కోరారు.

65 ఏళ్లలో పరిష్కారం కానీ తాగు నీటి, కరెంట్ సమస్యలకు కేసీఆర్ సర్కార్ పరిష్కారం చూపిందని ఆయన అన్నారు. గతంలో తాగునీటి కష్టాలతో ఎండాకాలంలో ఊళ్లలో ఉండేందుకు జనం భయపడేదని ఆయన గుర్తు చేశారు.  తెలంగాణ వచ్చిన తర్వాత రూ. 200 పెన్షన్ 10 రెట్లు పెరిగింది. 40 లక్షల మందికి , రూ.10 వేల కోట్లు పెన్షన్ల కోసం ఖర్చు పెడుతున్నాం అని వెల్లడించారు. జూలై, ఆగస్టు నెలల్లో ఊరురూ తిరిగి, ప్రతి కాలనీ తిరిగి అక్కడికక్కడే పెన్షన్లిస్తాం అని అన్నారు.  కొత్త రేషన్ కార్డులను కూడా ఇస్తామని తెలిపారు.

973 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి ఏడాదికి 5 లక్షల మందికి విద్యనందిస్తున్నామని.. ఇంతటి సంస్కారవంతమైన ప్రభుత్వం దేశంలో  ఎక్కడైనా ఉందా..? అని ప్రశ్నించారు. రూ.20 వేల కోట్లు ఫీజు రీఎంబర్స్మెంట్ కోసం ఖర్చు పెడుతున్నామని వెల్లడించారు. పెళ్లి చేసి చూడు, ఇళ్లు కట్టి చూడు అనే నానుడి ఉండేది.. పేదబిడ్డ పెళ్లికి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మీని అందిస్తుందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 36 నుంచి 56 శాతానికి ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల సంఖ్య పెరిగిందని.. వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద దేశంలో ఎక్కడా లేని విధంగా 63 లక్షల మంది రైతులకు రూ.50 వేల కోట్లు రైతు బంధు అందించామని వెల్లడించారు. .సోమశిల సిదేదశ్వరం వంతెనతో ఆంధ్రాకు హైదరాబాద్ కు జంక్షన్ లా కొల్లాపూర్ మారనుందని అన్నారు. అమరగిరిని ఏకో టూరిజం కింద అభివృద్ది చేస్తామని..ఆహార శుద్ది పరిశ్రమలు నెలకొల్పుతామని.. ఉద్యాన వన పాలిటెక్నిక్ ఏర్పాటు చేస్తాం అని హామీలు ఇచ్చారు.