Site icon NTV Telugu

KTR : రాష్ట్రంలో ఉపఎన్నికలు తథ్యం.. కేసీఆర్‌ సీఎం కాబోతున్నారు

Ktr

Ktr

పార్టీ ఫిరాయింపులపై మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నామని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వెల్లడించారు. కాంగ్రెస్‌ పార్టీపైన తొలి దెబ్బను జూబ్లీహిల్స్‌ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ కొట్టబోతోందని అన్నారు. రెండో దెబ్బను రాజేంద్రనగర్‌ లేదా ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో చూపిస్తామని కేటీఆర్‌ హెచ్చరించారు.

Broken Heart Syndrome: లవ్ బ్రేకప్ అయితే గుండెపోటు వస్తుందా?

‘‘కడియం శ్రీహరి ఏ పార్టీలో ఉన్నాడో ఆయనకే తెలియని పరిస్థితి. నిజంగా ధైర్యం ఉంటే ఉపఎన్నికకు వచ్చి ఎదుర్కోవాలి’’ అంటూ కేటీఆర్‌ సవాల్‌ విసిరారు. రాష్ట్రంలో త్వరలోనే ఉపఎన్నికలు జరుగనున్నాయని, రెండు సంవత్సరాల తర్వాత బీఆర్‌ఎస్‌ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘ప్రజలు మళ్లీ కేసీఆర్‌కే అవకాశం ఇస్తారు. ఆయననే తిరిగి ముఖ్యమంత్రిగా చూడబోతున్నారు’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Ayodhya: అయోధ్యలో 26 లక్షల దీపాలు.. రెండు గిన్నీస్‌ రికార్డులు

Exit mobile version