KTR : జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం బోరబండలో నిర్వహించిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బోరబండలో మీ స్వాగతం చూస్తుంటే జూబ్లీహిల్స్ లో మన గెలుపు పక్కా అని అర్థమవుతుంది.. మన మెజార్టీ ఎంత అనేది మాత్రమే చూడాలని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒకరిని కూడా మోసం చేయకుండా వదిలిపెట్టలేదని, ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చారు ఎన్నికల తర్వాత అన్ని మరిచిపోయారన్నారు.
వాళ్ళు చెప్పిన తులం బంగారం, స్కూటీలు మహిళలకు రాలేదని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాదులో ఒక్క రోడ్డు వేయలేదు కొత్త పని ఏదీ చేయలేదన్నారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని వచ్చి హైదరాబాదును ఆగం చేశారన్నారు. ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ఆడబిడ్డలను ఆటో వాళ్ళను మోసం చేశారన్నారు. రెండేళ్ల కింద ఇచ్చిన ఒక్క ఛాన్స్ ఇచ్చినా ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేదన్నారు కేటీఆర్. జూబ్లీహిల్స్ పక్కనే ఉండే సున్నం చెరువు పక్కన ఎన్నో ఇండ్లు కూల్చారని, కారుకూ బుల్డోజర్ కు జరుగుతున్న ఈ పోటీలో కారు ఎలాగైనా గెలవాలని ఆయన పిలుపునిచ్చారు.
Chevella Bus Accident : ఒక్క క్షణంలో అంతా జరిగిపోయింది. డ్రైవర్ తాగున్నాడా ?
అంతేకాకుండా.. ‘రాహుల్ గాంధీకి పంపేందుకు డబ్బులు ఉన్నాయి.. కానీ జూబ్లీహిల్స్ లో ఉన్న మహిళలకు ఇచ్చేందుకు మాత్రం డబ్బుల్లేవు అంటున్నాడు.. మొన్న కంటోన్మెంట్ లో వచ్చిన ఉప ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి ఇదే ముచ్చట చెప్పాడు.. కంటోన్మెంట్‌లో కాంగ్రెస్ గెలిచి 16 నెలలు అయింద.. 16 రూపాయలు కూడా ఇవ్వలేదు. అక్కడ చేయని అభివృద్ధి ఇక్కడ ఎలా చేస్తావు.. రేవంత్ రెడ్డి ఎలక్షన్ ముందు ఒక మాట మాట్లాడతాడు ఎలక్షన్ తర్వాత మరో మాట మాట్లాడతాడు.. జాబు నోటిఫికేషన్లు లేవు కానీ లూటిఫికేషన్ నడుస్తోంది..
గతంలో తియ్యని మాటలు చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పుడు పత్తా లేడు.. ఆడపిల్లలతో పెట్టుకున్న ఎవడు బాగుపడలేదు.. మాగంటి సునీత కన్నీళ్లను కూడా ఈ మంత్రులు అవమానించారు.. సునీత కన్నీళ్లను అవహేళన చేసిన దుర్మార్గులు ఈ కాంగ్రెస్ మంత్రులు.. హిట్లర్ లాంటి పెద్ద పెద్ద నియంతలే పోయారు.. నువ్వెంత నీ బతుకెంత రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం.. జూబ్లీహిల్స్ లో ఓటేయకుంటే పథకాలు బందు చేస్తా అని సీఎం అంటున్నాడు. నీ అయ్య సొమ్ము నీ అబ్బ సొమ్ము కాదు ఇది ప్రజల సొమ్ము. సునీత మనం గెలిపించండి పథకాలు ఎలా ఇయ్యవో గల్లా పట్టి అడుగుతాం.’ అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
Adilabad Airport: ఆదిలాబాద్ విమానాశ్రయ అభివృద్ధికి గ్రీన్ సిగ్నల్.. కీలక ముందడుగు
