NTV Telugu Site icon

Krishna River Management Board: తెలుగు రాష్ట్రాలకు లేఖ అనుమత్తుల్లేని వాటిని ఆపండి..

Krishna River Management Board

Krishna River Management Board

అనుమతులు లేకుండా ప్రాజెక్టుల పనుల తక్షణమే నిలిపివేయాలని కృష్ణానదీ యాజమాన్య బోర్డు (Krishna River Management Board) తెలుగు రాష్ట్రాలకు లేఖ రాసింది. ఈనేపథ్యంలో.. కేంద్రం గతంలో ఇచ్చిన గెజిట్‌ నోటిఫికేషన్‌ గడువు పూర్తయిన నేపథ్యంలో రెండు రాష్ట్రాల ఈఎన్సీలకు లేఖ రాసిన బోర్డు, ఈ విషయాన్ని పేర్కొంది. దీంతో.. ప్రాజెక్టుల అనుమతులకు కేంద్ర జలశక్తి శాఖ ఇచ్చిన గడువు ఈనెల బుధవారం 13తో ముగిసింది. కాగా.. పనులు నిలిపి వేయాలని స్పష్టం చేస్తూ బోర్డు ఆంధ్రా, తెలంగాణకు లేఖలు రాసింది. అయితే.. అనుమతుల్లేని ప్రాజెక్టులకు సంబంధించి రెండు రాష్ట్రాలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయని కృష్ణానదీ యాజమాన్య బోర్డు పేర్కొంది.

read also: Boris Johnson: ప్రధాని ఎవరైనా మంచిదే.. కానీ రిషి సునక్ మాత్రం వద్దు

ఈనేపథ్యంలో.. గతేడాది జులై 15న కేంద్ర జలశక్తిశాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలు అనుమతుల్లేని ప్రాజెక్టుల పనులు ఆపివేయాలని తెలిపింది. అయితే.. ఆదేశాలపై తగిన నివేదికలు ఇవ్వాలని నిరుడు జులైతో పాటు ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ రెండు రాష్ట్రాలకు లేఖలు రాసినట్టు గుర్తు చేసింది. ఇక శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలపై చాలా వివాదాలు ఉన్నాయన్న బోర్డు, రెండు ప్రాజెక్టులకు చెందిన 15 కాంపొనెంట్లను స్వాధీనం చేసుకునేందుకు నిర్ణయం జరిగినట్టు లేఖలో పేర్కింది. నిన్న జరిగిన 15వ కేఆర్ఎంబీ సమావేశంలో ఈ మేరకు ఏకాభిప్రాయం కుదిరిందని, కాంపొనెంట్ల స్వాధీనానికి ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపింది. ఈనేపథ్యంలో.. బోర్డు తీసుకున్న ఈ కీలక నిర్ణయం అమలైతే వివాదాస్పద అంశాలన్నింటికీ పరిష్కారం లభిస్తుందని లేఖలో పేర్కొంది.